ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద.. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరికొత్త లుక్ తో అదరగొట్టాడు.ఈ సినిమా ను సెప్టెంబర్ 15 న వినాయక చవితి సందర్భంగా ఎంతో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.ఆగష్టు 26 వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు. ఇదే విషయాన్ని అధికారింగా ప్రకటిస్తూ.. ప్రీ రిలీజ్ థండర్ అంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.
స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ శిల్ప కళా వేదికలో నిర్వహించనున్నట్లు సమాచారం.ఈ ఈవెంట్ కోసం రామ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.అయితే ఈ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా నందమూరి బాలకృష్ణ రానున్నట్లు ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. బాలయ్యతో బోయపాటికి మంచి అనుబంధం ఉంది. దీనితో ఈ ఈవెంట్ కు గెస్ట్ గా ఆహ్వానించినట్లు తెగ వార్తలు వస్తున్నాయి.దీనితో ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇప్పటీకే స్కంద చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్లు సమాచారం.ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు ట్రెండింగ్ గా నిలిచాయి. ఈ పాటలలో రామ్,శ్రీలీల సూపర్ స్టెప్స్ తో అదరగొట్టారు. ఈ సినిమాలో రామ్, శ్రీలీల కెమిస్ట్రీ కూడా అదిరిపోనున్నట్లు సమాచారం. ఈ సినిమా నుండి విడుదల అయిన గ్లింప్స్ వీడియోలో బోయపాటి తన మార్క్ డైలాగ్స్ తో రామ్ ను ఊర మాస్ లుక్ లో చూపించారు.మరి ఈ సినిమా విడుదల అయిన తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి