ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ స్కంద.. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు వున్నాయి.తన సినిమాలో హీరోలను ఓ రేంజ్ లో ఎలివేట్ చేసే బోయపాటి.. రామ్‌ను ఎలా చూపిస్తాడని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అనుకుంటున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు, టీజర్ మరియు ట్రైలర్‌లను విడుదల చేయగా.. ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ ట్రైలర్ అప్‌డేట్ ను ఇచ్చారు.ఈ మూవీ నుంచి కొత్త ట్రైలర్‌ను ఈరోజు జరుగబోయే స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు..
దీనికి సంబంధించి ప్రోమో ను విడుదల చేయగా ఈ ప్రోమోలో ”నువ్వేం కావాలి అనుకుంటున్నావు అని టీచర్ రామ్ ని అడిగితే.. సీఎం కావాలి అనుకుంటున్నా అని షాకింగ్ రిప్లయ్ ఇస్తాడు. ఎందుకు అంటే. ఆ పోస్టుల దమ్ముంది సార్. ఎటు వెళ్లిన కూడా ట్రాఫిక్ సిగ్నల్ లొల్లి ఉండదు, పైప్ పెట్టి ఊదుడు ఉండదు. మన బర్త్‌డే అయితే స్టేట్ మొత్తం మన ఫ్లెక్సీలు లేస్తాయి. అంటూ రామ్ పోతినేని చెప్పిన డైలాగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28 ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉండగా.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది. సోమవారం రోజు కరీంనగర్‌లోని వీ కన్వెన్షన్ హాల్‌లో సాయంత్రం 6గంటల నుంచి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరుగనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ సరసన హీరోయిన్ గా శ్రీలీల నటించింది.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన అన్ని పాటలు చార్ట్ బస్టర్‌లుగా నిలిచాయి. ఈ సినిమాకు ఇప్పటికే ఓ రేంజ్‌లో బిజినెస్ జరిగినట్లు సమాచారం..
Skanda 2nd trailer 🥵💥💥
Last lo short mathram ARACHAKAM anthe 🥵#Skanda #SkandaOnSep28 #SkandaBookings #RAmPOthineni pic.twitter.com/7Eanxg1jj1
— Rapo__vijay_status (@JayaBhagavan2) September 24, 2023