NTV Telugu Site icon

Sitrang Cyclone: ‘సిత్రాంగ్’ వచ్చేస్తోంది.. తస్మాత్ జాగ్రత్త

Rain Telangana

Rain Telangana

Cyclone Sitrang : ప్రస్తుతం గంటగంటకు వాతావరణం మారుతోంది. అప్పుడే ఎండ దండికొడుతోంది. మళ్లీ కాసేపటికే భారీ వర్షం పడుతూ ప్రజలను ఇబ్బందికి గురిచేస్తోంది. మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నాయి. ఈ వానలకు ఇప్పటికే వాగులు, చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు అయితే వరద నీటిలో చిక్కికుపోయాయి. గతంలో వర్షాలు కురిసినప్పటికీ.. ఇలా నిరంతరంగా ఎప్పుడూ కురవలేదు. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వర్షాలకు జనాలు అల్లల్లాడుతున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. దీంతో భయంతో జనాలు బిక్కుబిక్కుమంటున్నారు.

Read Also: Crops Loss: అకాలవర్షం. ఆందోల్ పత్తి రైతులకు అపారనష్టం

తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు ఉందని తాజాగా వాతావరణ శాఖ చెప్పింది. మంగళవారం ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందట. దాంతో అక్టోబర్ 20 నాటికి అది తీవ్ర వాయుగుండంగా, ఆపై తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీనికి ‘సిత్రాంగ్’ అని పేరు పెట్టారు. సిత్రాంగ్ అంటే థాయ్ భాషలో ‘వదలని’ అని అర్ధం. సిత్రాంగ్ ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో భారీగా వర్షాలు కురువనున్నాయట.

Read Also: Missing Case: కడపలో ఏడో తరగతి విద్యార్థిని మిస్సింగ్.. మూడు రోజులు దాటినా దొరకని ఆచూకీ

మరోవైపు నవంబరులో ఏర్పడే వాయుగుండాలు తుపానుగా బలపడేందుకు అవకాశముందని విశాఖకు చెందిన వాతావరణ నిపుణుడు మురళీ కృష్ణ పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావం వల్ల రాబోయే కొద్ది రోజుల పాటు రాష్ట్ర మంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. ‘అక్టోబరులో నైరుతి రుతుపవనాల తిరోగమనంలో అల్పపీడనాలు ఏర్పడడం సాధారణం. ప్రస్తుతం ఒకదాని తరువాత మరొకటి ఏర్పడుతున్నాయి. అందుకే ఎన్నడూ లేని విధంగా ఈసారి అధికంగా వర్షాలు పడుతున్నాయి. గతంలో వర్షాలు కురిసినప్పటికీ.. ఇలా నిరంతరంగా ఎప్పుడూ కురవలేదు. మరికొన్ని రోజులపాటు ఈ తరహా వర్షాలు ఉంటాయి’ అని అన్నారు.