Site icon NTV Telugu

KCR: కేసీఆర్‌కు మరోసారి నోటీసులు.. నంది నగర్‌ నివాసంలో ఇంటి గోడకు నోటీసులు అతికించిన సిట్

Sit

Sit

ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచేస్తోంది. వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలను విచారిస్తున్న సిట్ ఏకంగా గులాబీ బాస్ కేసీఆర్‎కు మరోసారి నోటీసులు జారీ చేసింది. సిట్ నంది నగర్‌ నివాసంలో ఇంటి గోడకు నోటీసులు అతికించింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొంది. నంది నగర్‌ నివాసంలో విచారణ చేస్తామని సిట్ తెలిపింది. CRPC 160 కింది సిట్ నోటీసులు ఇచ్చింది.

Also Read:Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

అధికారిక రికార్డ్‌లో ఉన్న సమాచారం మేరకే.. నందినగర్‌ ఇంటిలో విచారించేందుకు సిట్ నిర్ణయించినట్లు తెలిపింది. నందినగర్‌ ఇంటిలోనే విచారణ చేసేందుకు సిట్ బృందం సిద్ధమైంది. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారణకు సిట్‌ నిరాకరించింది. ఈ విచారణలో కొన్ని ఎలక్ట్రానిక్‌, భౌతిక రికార్డులు ఉండటంతో.. ఎర్రవల్లి తరలించడం పరిపాలన పరంగా ఇబ్బందులు తలెత్తుతాయని సిట్ తెలిపింది.

Exit mobile version