Moinabad Farm House Case : మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మరోఇద్దరికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఉన్న నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్ పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్ కు నోటీసులు ఇచ్చింది. నేడు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న సింహయాజికి విమాన టికెట్ బుక్ చేసిన శ్రీనివాస్ ను సిట్ మూడో రోజు విచారించనున్నారు. ఇప్పటికే వరుసగా రెండు రోజుల పాటు శ్రీనివాస్ ను విచారించారు.
Read Also: 2Job Notifications Cancelled: రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు రద్దు.. ఆందోళనలో నిరుద్యోగులు
మరో వైపు ఈ కేసులో తుషార్, జగ్గుస్వామిలకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది సిట్. వారు దేశం విడిచి పోకుండా అన్ని విమానాశ్రయాలు, ఇమ్మిగ్రేషన్ అధికారులు, అంతర్జాతీయ సరిహద్దుల్లోని అధికారులకు సర్క్యులర్లు పంపారు. ఇప్పటివరకు నోటీసులకే పరిమితం కాగా.. ప్రస్తుతం అరెస్ట్‌ల దిశగా సిట్ అడుగులు వేస్తోంది. ఈ విషయంపై న్యాయనిపుణులతో చర్చిస్తోంది. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ వైద్యుడు డా.జగ్గుస్వామి, భారతీయ ధర్మజనసేన చీఫ్ తుషార్‌లకు నోటీసులు ఇచ్చినా.. ఇప్పటివరకు సిట్ ముందు హాజరుకాలేదు.