Liquor Scam: లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితుడు అరెస్టు!
- ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరొకరు అరెస్టు
- బాలాజీ గోవిందప్పను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు
- గోవిందప్పను విజయవాడకు తీసుకొస్తున్న సిట్ బృందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ లిక్కర్ స్కాం కేసులో మరొకరు అరెస్టు అయ్యారు. కీలక నిందితుడు బాలాజీ గోవిందప్పను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో ఈరోజు ఉదయం గోవిందప్పను అరెస్ట్ చేసి.. విజయవాడకు తీసుకొస్తున్నారు. భారతీ సిమెంట్స్‌లో గోవిందప్ప డైరెక్టర్‌గా ఉన్నారు. లిక్కర్ స్కాం కేసులో అయన ఏ33గా ఉన్నారు. గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. సుప్రీం కోర్టులో పిటిషన్ విచారణ దశలో ఉంది.
Also Read: Suresh Babu: సంజాయిషీపై సంతృప్తి చెందకపోతే.. సురేష్ బాబుపై అనర్హత వేటు?
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఏపీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలంటూ బాలాజీ గోవిందప్పతో పాటు సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డికి 3 రోజుల క్రితం సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ కమిషనరేట్‌లోని సిట్ కార్యాలయంలో గత ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ముగ్గురిని ఆదేశించారు. అయితే వీరు ఆ నోటీసులను బేఖాతరు చేస్తూ.. విచారణకు డుమ్మా కొట్టారు. గోవిందప్ప మైసూరులో ఉన్నాడన్న పక్కా సమాచారంతో.. సిట్ అధికారులు అక్కడికి వెళ్లి ఈరోజు అరెస్ట్ చేశారు. గోవిందప్ప అరెస్టుతో లిక్కర్ కేసులో అరెస్టుల సంఖ్య ఐదుకి చేరింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!