ఓటీటీలోకి కొత్త సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి.. అందులో కొన్ని సినిమాలు థియేటర్లలో భారీ సక్సెస్ ను అందుకున్నాయి.. కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.. తాజాగా మరో సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది.. జయంరవి, కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా సైరన్.. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తుంది.. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో జయంరవి ఖైదీగా కనిపించగా, కీర్తిసురేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది.. అనుపమ పరమేశ్వరన్ గెస్ట్ రోల్ లో నటించింది..
ఈ సినిమాను మొదటగా తమిళంతో పాటుగా తెలుగులో కూడా విడుదల చెయ్యాలని అనుకున్నారు.. కానీ తమిళంలో మాత్రమే రిలీజ్ చేశారు.. రెండు నెలల క్రితం విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.. తమిళంలో నెగెటివ్ టాక్ రావడంతో తెలుగు వెర్షన్ రిలీజ్‌కు నోచుకోలేదు. తెలుగు వెర్షన్ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది.. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో సైరన్ 108 పేరుతో ఏప్రిల్ 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం హిందీ భాషల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.. ఈ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసేసారు..
ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ప్రాణంగా ప్రేమించిన భార్యను ఎవరో హత్య చేసి ఉంటారు.. అయితే ఆ హత్య జయంరవినే చేసాడని అతన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు.. ఈ హత్య కేసును కీర్తి సురేష్ డీల్ చేస్తుంది.. ఈ హత్య ఎలా జరిగింది అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతుంది.. రొటీన్ స్టోరీగా ఉండటంతో సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.. దీంతో సినిమా ఎక్కువ రోజులు ఆకట్టుకోలేక పోయింది.. మరి ఓటీటీలో అన్నా హిట్ అవుతుందేమో చూడాలి..