Site icon NTV Telugu

Sirai: బలగం రేంజ్ ఎమోషన్.. ఓటిటిలోకి వచ్చేసిన తమిళ బ్లాక్ బస్టర్ క్రైమ్ డ్రామా!

Sirai Ott Movie

Sirai Ott Movie

తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పిన ‘బలగం’ సినిమా చూసి ప్రేక్షకులు ఎంతలా ఎమోషనల్ అయ్యారో మనందరికీ తెలిసిందే. సరిగ్గా అలాంటి హృదయాన్ని హత్తుకునే అనుభూతినే అందిస్తోంది ఇటీవల తమిళంలో సంచలనం సృష్టించిన  ‘సిరై’ అనే ఓ చిన్న సినిమా. కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ మూవీ, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఓటిటిలోకి వచ్చేసింది. టీమిండియా స్టార్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం థియేటర్‌కు వెళ్లి చూసి ఫిదా అయ్యారంటే, ఈ సినిమాలో ఎంతటి ఎమోషనల్ డెప్త్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read : OTT Movie: వరుస హత్యలతో వణికిపోతున్న ఊరు.. ఓటీటీలో ‘కాంతార’, ‘శంభాల’ రేంజ్ హారర్ థ్రిల్లర్!

ఈ కథ అంతా ‘కదిరవన్’ అనే ఒక హెడ్ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. అబ్దుల్ రౌఫ్ అనే ఒక విచారణా ఖైదీని కోర్టుకు తరలిస్తుండగా అతను తప్పించుకుంటాడు. అసలు ఆ ఖైదీ ఎవరు? అతను చేసిన హత్య వెనుక ఉన్న గతం ఏంటి? ఒక క్రైమ్ థ్రిల్లర్‌లా మొదలైన ఈ ప్రయాణం, చివరికి ఒక అద్భుతమైన ఎమోషనల్ లవ్ స్టోరీగా మారుతుంది. పక్కా నేటివిటీతో, కళ్ళకు కట్టినట్లు ఉండే సన్నివేశాలతో సాగే ఈ మూవీ, ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తుంది. క్రైమ్ డ్రామాలను ఇష్టపడే వారితో పాటు ఎమోషనల్ సినిమాలను ప్రేమించే వారు అస్సలు మిస్ అవ్వకూడదు.

Exit mobile version