Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 94 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సినీ పరిశ్రమకు విభిన్నమైన, ప్రయోగాత్మక చిత్రాలను అందించిన గొప్ప దర్శకుడిగా సింగీతం శ్రీనివాసరావును వారు కొనియాడారు. సింగీతం మృతి చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు.
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వ ప్రతిభను గుర్తుచేసుకున్న పవన్ కల్యాణ్.. ‘పుష్పక విమానం’, ‘విచిత్ర సోదరులు’, ‘మయూరి’, ‘ఆదిత్య 369’, ‘మైఖేల్ మదన కామరాజు’ వంటి చిత్రాల్లో ఆయన చేసిన ప్రయోగాలు, చూపిన సృజన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని అన్నారు. ‘అమెరికా అమ్మాయి’, ‘పంతులమ్మ’ వంటి చిత్రాల్లోని పాటలు కూడా ఎంతో ప్రజాదరణ పొందాయని గుర్తుచేశారు. 94 ఏళ్ల వయసులోనూ ‘సింగ్ గీతం’ చిత్రానికి దర్శకత్వం వహించడం ఆయనకు సినిమాపై ఉన్న అంకితభావానికి నిదర్శనమని పవన్ పేర్కొన్నారు. సింగీతం శ్రీనివాసరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
మరోవైపు సింగీతం శ్రీనివాసరావు మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని అన్నారు. తన తాతయ్య ఎన్టీఆర్, ‘బాలా మామయ్య’తో కలిసి సింగీతం పనిచేశారని గుర్తుచేసుకున్నారు. బాలకృష్ణ కెరీర్లో ఆణిముత్యాల్లాంటి ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’ వంటి చిత్రాలకు సింగీతం దర్శకత్వం వహించారన్నారు. విభిన్న కథలు, వినూత్నమైన కథనాలతో తెలుగు సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన అని కొనియాడారు. వృద్ధాప్యంలోనూ సినిమా పట్ల అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ‘సింగ్ గీతం’ చిత్రాన్ని తెరకెక్కించడం సింగీతం శ్రీనివాసరావు ప్రతిభకు, పట్టుదలకు నిదర్శనమని లోకేశ్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!