NTV Telugu Site icon

CM Revanth Reddy : ఇవాళ్టి నుంచి సీఎం రేవంత్‌ రెడ్డి దావోస్‌ పర్యటన

Cm Revanth Reddy

Cm Revanth Reddy

సింగపూర్ పర్యటనలో మూడు రోజుల పాటు సీఎం, మంత్రి, రాష్ట్ర బృందం విశేషంగా కార్యకలాపాలు నిర్వహించింది. కీలక చర్చల ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, అవకాశాలను ఆకర్షించింది. సింగపూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE)తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం అవగాహన కుదిరింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రూ.3,500 కోట్లతో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా ముందుకొచ్చింది. క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ రూ.450 కోట్లతో హైదరాబాద్‌లో ఐటీ పార్కు అభివృద్ధికి ప్రతిపాదన చేసింది. సెమీ కండక్టర్ పరిశ్రమలపై చర్చలు విజయవంతమయ్యాయి. సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్, ఇతర ప్రతినిధులతో సంప్రదింపులు జరిగాయి.

 CM Chandrababu: ముఖ్యమంత్రి దావోస్‌కు పయనం.. ఆల్ ది బెస్ట్ చెప్పిన అధికారులు

దావోస్ పర్యటనపై భారీ అంచనాలు

దావోస్ పర్యటనలో ఐటీ, ఫార్మా, బయోసైన్స్, డేటా సెంటర్లలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది.

ఫార్మా సిటీ: పర్యావరణ అనుమతులతో భూములను సిద్ధం చేయడం పూర్తయింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 35% వ్యాక్సిన్లు తెలంగాణలో ఉత్పత్తి అవుతున్నాయి.
ఫోర్త్ సిటీ, స్కిల్ యూనివర్సిటీలు: యువతలో నైపుణ్యాలను పెంచేందుకు ప్రాధాన్యం ఇచ్చి, పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

గత ఏడాది దావోస్ పర్యటనలో రూ. 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది మరో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. డేటా సెంటర్ల ప్రాముఖ్యత పెరుగుతుండటంతో హైదరాబాద్ చుట్టూ విస్తృత స్థాయిలో వీటి ఏర్పాటుకు సదుపాయాలు కల్పించబడుతున్నాయి.

కంపెనీల అధినేతలు, బిజినెస్ ప్రతినిధులతో సమావేశాలు విజయవంతమయ్యాయి. ఫార్మా సిటీ పరిధిలో వేల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. ఈ ప్రాంతంలో పెట్టుబడులకు మరింత ప్రోత్సాహం ఇవ్వనున్నారు. తెలంగాణకు పెట్టుబడులను మరింతగా ఆకర్షించి, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.

Sambhal violence: సంభాల్ హింసలో మరో 10 మంది అరెస్ట్.. దావూద్ ఇబ్రహీం ముఠాతో సంబంధం..