NTV Telugu Site icon

Ex MLA Yamini Bala: వైసీపీకి మరోషాక్.. మాజీ ఎమ్మెల్యే రాజీనామా..

Yamini Bala

Yamini Bala

Ex MLA Yamini Bala: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలినట్టు అయ్యింది.. వైసీపీకి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే యామిని బాల.. ఓ విడియో విడుదల చేసిన ఆమె.. తాను వైసీపీకి గుడ్‌బై చెబుతున్నట్టు పేర్కొన్నారు.. ఇంత కాలం తనకు సహకరించిన పార్టీ శ్రేణులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.. వైసీపీకి రాజీనామా చేశాను.. రాజీనామా లేఖను వైసీపీ అధిష్టానానికి, పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఫ్యాక్స్‌ చేసినట్టు చెప్పుకొచ్చారు. కాగా, ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి శింగనమల టికెట్‌ ఆశించి భంగపడ్డారు యామిని బాల.. దీంతో, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె.. ఇప్పుడు రాజీనామా చేశారు.. మరి ఏ పార్టీలో చేరతారు అనే విషయం తెలియాల్సి ఉంది.

Read Also: Pakistan Cricket Team: పాకిస్థాన్ ఆటగాళ్లకు స్నైపర్ ట్రైనింగ్.. వీడియో వైరల్

కాగా, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శింగనమల నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు యామిని బాల.. అప్పుడు ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది.. కానీ, 2019 ఎన్నికల్లో అప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న యామినిబాలకు బదులు కొత్తగా వచ్చిన బండారు శ్రావణికి అవకాశం కల్పించారు చంద్రబాబు.. అయితే, తన కుమార్తెకు టికెట్ కోసం చివరి వరకు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న శమంతకమణి ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.. దీంతో.. టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కూతురు మాజీ ఎమ్మెల్యే యామిని బాల.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో.. టీడీపీకి రాజీనామా చేసి.. సీఎం వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరారు.. ఇప్పుడు వైసీపీ టికెట్‌ దక్కకపోవడంతో.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. తన రాజకీయ భవిష్యత్తుపై యామిని బాల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది. కాగా, శింగనమల నియోజకవర్గానిక ఓ ప్రత్యేక ఉంది.. అక్కడ ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే.. ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్‌ ఉంది.. గతంలో చాలా సార్లు అది రుజువైంది కూడా. మరి ఈ సారి ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచిచూడాలి..