Silk Smitha Birth Anniversary: సిల్క్ స్మిత.. ఓ అయస్కాంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Silk Smitha Birth Anniversary: జ్యోతిలక్ష్మిలాగా గొప్ప నర్తకి కాదు, జయమాలినిలాగా అందం, చందం ఉన్నదీ లేదు. అయినా సిల్క్ స్మిత ప్రవేశంతో ఆ ఇద్దరికీ కొన్ని అవకాశాలు తగ్గాయి అనడం అతిశయోక్తి కాదు. మరి సిల్క్ స్మితలో ఏముంది? మత్తెక్కించే కళ్ళతో మైమరిపించే ఆకర్షణ ఉంది. అందుకే సిల్క్ ను కొందరు అయస్కాంతం అన్నారు.
సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపట్ల విజయలక్ష్మి. 1960 డిసెంబర్ 2న ఏలూరు తాలూకా దెందులూరు మండలం కొవ్వలిలో విజయలక్ష్మి జన్మించారు. నాల్గవ తరగతి దాకా చదువుకున్న విజయలక్ష్మి, ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేసింది. పదిహేనేళ్ళకే పెళ్ళి చేసేశారు. ఆమె భర్త, అత్తమామలు వేధిస్తూ ఉండడంతో ఇల్లు వదలి పారిపోయారు. మదరాసు చేరి, తొలుత టచప్ ఆర్టిస్ట్ గా పనిచేశారు స్మిత. కొంతమంది హీరయిన్లకు టచప్ చేస్తున్న సమయంలోనే బిట్ రోల్స్ లో నటించే అవకాశం దక్కింది. మళయాళ దర్శకుడు ఆంథోనీ ఈస్ట్ మన్ దర్శకత్వం వహించిన ‘ఇనయె తేడీ’ చిత్రంలో స్మితకు తొలిసారి నాయిక పాత్ర లభించింది. ఈ సినిమాకు ముందు తమిళంలో ‘వండిచక్రం’ అనే చిత్రంలో స్మిత కీలక పాత్ర పోషించారు. ఈ రెండు చిత్రాలలో తమిళ, మళయాళ చిత్రసీమల్లో స్మితకు మంచి గుర్తింపు లభించింది. ‘వండి చక్రం’ తెలుగులో ‘ఘరానా గంగులు’గా రీమేక్ కాగా, అందులో స్మిత నటించి, తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మాతృభాష తెలుగులో స్మితకు వచ్చీ రాగానే మంచి అవకాశాలు లభించాయి. ‘సీతాకోకచిలుక’లో శరత్ బాబు భార్యగా నటించారు. ‘రోషగాడు’లో సిఐడీ పాత్రలో కనిపించారు. యన్టీఆర్ ‘నా దేశం’ చిత్రంలో “నేనొక నెత్తురు దీపం…” సాంగ్ లో నర్తించారు స్మిత. ఆ తరువాత నుంచీ ఐటమ్ గాళ్ గా ఆమె సాగిపోయారు. అప్పటి టాప్ హీరోస్ అందరి చిత్రాలలోనూ సిల్క్ స్మిత డాన్సులు భలేగా కనువిందు చేశాయి.
Also Read
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
FIFA Fan Event: ఫిఫా ఈవెంట్లో రెపరెపలాడిన భారత జెండా.. నోరా డ్యాన్స్‌కు ఫిదా.. వీడియో వైరల్
ఐటమ్ గాళ్ గా సాగుతున్నా, సిల్క్ స్మిత తనకంటూ ఓ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకున్నారు. ఆమె ప్రధాన నాయికగా ‘మాయలేడి’ అనే చిత్రం రూపొంది జనాన్ని ఆకట్టుకుంది. ఇక ‘బావ-బావమరిది’లో వ్యాంప్ గా సిల్క్ అభినయం భలేగా అలరించింది. ‘లేడీ జేమ్స్ బాండ్’లోనూ, చిరంజీవి ‘గూండా, ఛాలెంజ్’, బాలకృష్ణ ‘ఆదిత్య 369’ చిత్రాలలోనూ కీలక పాత్రల్లో కనిపించారు సిల్క్ స్మిత. తన దరికి చేరిన ఐటమ్ సాంగ్స్ లోనూ, తగిన పాత్రల్లోనూ స్మిత ఆకట్టుకున్నారు. మాతృభాష తెలుగుతో పాటు తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలోనూ సిల్క్ స్మిత తనదైన బాణీ పలికించారు. సిల్క్ ఐటమ్ సాంగ్ ఆ రోజుల్లో ఓ పేయింగ్ ఎలిమెంట్ గా ఉండేది.
మత్తు కళ్ళతో చూపరులను చిత్తు చేసిన సిల్క్ స్మిత నిజజీవితంలో పసిపిల్ల మనస్తత్వం కలిగి ఉండేవారు. 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమె నర్తించిన, నటించిన చిత్రాలను చూస్తూ అభిమానులు ఆ బాధను మరచిపోగలిగారు. సిల్క్ స్మిత జీవితంలోని ముఖ్య ఘట్టాలు సినిమాకు పనికి వస్తాయని బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ భావించారు. సిల్క్ జీవితం ఆధారంగానే ఏక్తాకపూర్ ‘ద డర్టీ పిక్చర్’ నిర్మించారు. సిల్క్ జయంతి సందర్భంగా 2011 డిసెంబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేశారు. సిల్క్ పేరు మీద కోట్ల రూపాయలు సంపాదించారు. సిల్క్ స్మిత నేడు లేరు. ఆమె నటించిన చిత్రాలు బుల్లితెరపై కనిపిస్తే చాలు అభిమానులు ఈ నాటికీ కళ్ళింతలు చేసుకొని చూస్తూనే ఉన్నారు. అదీ… సిల్క్ మత్తు కళ్ళలోని గమ్మత్తు. అదే ఓ అయస్కాంతం అనీ చెప్పవచ్చు
తాజావార్తలు
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
-
Naga Vamsi: ‘ఇది అంత కలర్‌ఫుల్ ఫీల్డ్ కాదు’.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
-
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!