NTV Telugu Site icon

Bumper Offer : గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇద్దర్ని కంటే ఇంక్రిమెంట్.. ముగ్గుర్ని కంటే డబుల్ ఇంక్రిమెంట్

Sikkim

Sikkim

Bumper Offer : సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. నానాటికి తగ్గిపోతున్న తమ జాతి జనాభాను పెంచుకునేందుకు సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ కొత్త రకం పాలసీ తీసుకురానున్నారు. పిల్లల్ని కన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్‌ ఇవ్వనున్నారు.. అందులో ఇద్దరిని కంటే సాధారణ ఇంక్రిమెంట్ ఇస్తామని… మూడో పిల్లాడ్ని కంటే డబుల్‌ ఇంక్రిమెంట్‌ ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఐవీఎఫ్ ద్వారా తల్లి అయ్యేందుకు అవసరమైన డబ్బును కూడా ఇవ్వనున్నట్లు స్వయంగా సీఎం ప్రకటించారు. మాఘే సంక్రాంతి పర్వదినం సందర్భంగా దక్షిణ సిక్కింలోని జోరెథాంగ్‌ పట్టణంలో జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సీఎం ఈ ప్రకటన చేశారు.

Read Also: Folding House : ఈ ఇళ్లు ఎక్కడికైనా మడతపెట్టుకుని తీసుకువెళ్లొచ్చు

సిక్కిం రాష్ట్రంలో జనాభాను పెంచేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పలు ప్రోత్సాహకాలను ఇప్పటికే ప్రకటించారు. ఇటీవలికాలంలో సంతనోత్పత్తి చాలా తగ్గిపోయిందని విచారం వ్యక్తం చేశారు. పిల్లల్ని కనే ఉద్యోగులకు ప్రోత్సాహాకాలను ప్రకటించారు. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగినులు ఎక్కువ మంది పిల్లల్ని కంటారో.. వారికి ఎక్కువ ఇన్ సెంటీవ్స్ అందుతాయన్నారు. ఇద్దరు పిల్లల్ని కంటే ఒక ఇన్సెంటీవ్‌, ముగ్గురు పిల్లల్ని కన్నవారికి డబుల్‌ ఇక్రిమెంట్‌ తో పాటు ఎక్కువ సెలవులు తీసుకునేందుకు కూడా అనుమతిస్తామని కూడా చెప్పారు. ఐవీఎఫ్‌ ద్వారా పిల్లల్ని కనే ఉద్యోగినులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం తమాంగ్‌ వెల్లడించారు. ఐవీఎఫ్‌ సౌకర్యం ద్వారా ఇప్పటివరకు 38 మంది మహిళలు గర్భం దాల్చారని, కొందరు తల్లులు కూడా అయ్యారని తెలిపారు. కాగా, సర్వీసులో ఉన్న మహిళలకు 365 రోజుల ప్రసూతీ సెలవులు ఇస్తున్నారు. మగ ఉద్యోగులకు 30 రోజుల పితృత్వ సెలవులు తీసుకునేందుకు అనుమతిస్తున్నారు.

Show comments