NTV Telugu Site icon

IND vs BAN: శుభ్‌మన్‌ గిల్‌కు విశ్రాంతి.. జట్టుకు దూరమైన ఆటగాడికి ఛాన్స్!

Shubman Gill

Shubman Gill

సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. అక్టోబర్‌ 7 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌ ప్రారంభం అవుతుంది. ఈ టీ20 సిరీస్‌కు స్టార్‌ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పని భారాన్ని తగ్గించే విధానంలో భాగంగా అతడిని పొట్టి సిరీస్‌లో ఆడించకూడదని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. ఈ సీజన్లో భారత్ ఆడే పది టెస్టులకు అతడు జట్టులో ఉండే అవకాశముంది. త్వరలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ జరగనున్న నేపథ్యంలో గిల్‌తో పాటు కొందరు కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయి.

‘బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు శుభ్‌మన్‌ గిల్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో అక్టోబర్‌ 7 భారత్‌ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడబోతోంది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు అక్టోబర్‌ 16న ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో గిల్‌పై పని భారాన్ని తగ్గించాల్సి ఉంది’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గిల్‌తో పాటు మొహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలకు కూడా టీ20ల్లో విశ్రాంతిని ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ రిషబ్‌ పంత్‌కు సైతం రెస్ట్‌ ఇస్తే.. చాలా రోజులుగా జట్టుకు దూరమైన వికెట్ కీపర్ ఇషాన్‌ కిషన్‌ జట్టులో పునరాగమనం చేస్తాడు.

Show comments