KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
- శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ
- కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రాక్టీస్‌లో కుడిచేతి రింగ్ ఫింగర్‌కు గాయం
- గాయం కారణంగా ఎస్ఎల్సీ XIతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్ కు గిల్ దూరం..
- ఇది కేవలం ముందుజాగ్రత్త చర్య మాత్రమేనని బీసీసీఐ వెల్లడి..
- గిల్ స్థానంలో కేఎల్ రాహుల్ వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KL Rahul: భారత్, శ్రీలంక మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడటంతో వార్మప్ మ్యాచ్ తొలి రోజుకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లో కుడిచేతి రింగ్ ఫింగర్ కు గాయమైనట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా ప్రకటించింది.
బీసీసీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్ లో గిల్‌కు గాయం అయ్యింది. ముందుజాగ్రత్త చర్యగా ఎస్ఎల్సీ XIతో జరుగుతున్న మూడు రోజుల వార్మప్ మ్యాచ్ తొలి రోజు అతడికి విశ్రాంతి ఇచ్చారు. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం గిల్ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తోంది. అయితే గాయం తీవ్రత ఎంత.? అతను ఎప్పటికి పూర్తిగా కోలుకుంటాడు.? అనే విషయాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.
Also Read
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
- Lokesh Kanagaraj DC Movie Review : లోకేష్ కనగరాజ్ 'డీసీ' రివ్యూ..
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
కెప్టెన్‌గా కేఎల్ రాహుల్:
శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. టెస్టు సిరీస్‌కు ముందు ఈ మ్యాచ్ భారత ఆటగాళ్లకు ఎంతో కీలకం. తుది జట్టు కూర్పు, ఆటగాళ్ల ఫామ్‌ను అంచనా వేయడానికి ఈ మ్యాచ్‌ను టీమ్ మేనేజ్మెంట్ ఉపయోగించుకోనుంది. కొలంబోలోని నాన్‌డిస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ మూడు రోజుల వార్మప్ మ్యాచ్‌లో ఎస్ఎల్సీ XI టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఆగస్టు 7 నుంచి 9 వరకు జరుగుతుంది. టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టుకు ఇది చివరి ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో ప్రాధాన్యత ఏర్పడింది.
జట్టులో ఆందోళన:
శుభ్‌మన్ గిల్ గాయం భారత జట్టులో ఆందోళన కలిగిస్తోంది. టెస్టు జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గిల్, జట్టుకు కీలక బ్యాటర్ కూడా. అయితే ఇది కేవలం ముందుజాగ్రత్త చర్య మాత్రమేనని, అతని కోలుకునే ప్రక్రియపై వైద్య బృందం నిరంతరం నిఘా ఉంచిందని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇప్పుడు అందరి దృష్టి ఒక్క విషయంపైనే ఉంది. శ్రీలంకతో టెస్టు సిరీస్ ప్రారంభమయ్యే నాటికి శుభ్‌మన్ గిల్ పూర్తిగా కోలుకుని జట్టులోకి తిరిగి వస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
-
Brand Value: రిటైర్ అయినా తగ్గని బ్రాండ్ విలువ.. రూ.1,189 కోట్లతో టాప్‌లో.. కోహ్లీ, ధోనీ కాదండోయ్!
-
WTC 2025-27: ఆస్ట్రేలియా టాప్, భారత్ 5వ స్థానం.. మిగిలిన 9 మ్యాచ్‌లు డూ ఆర్ డై..
-
Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!