Shubman Gill Discharged: టీమిండియా జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత ఆదివారం నాడు తిరిగి జట్టు బస చేస్తున్న హోటల్‌కు చేరుకున్నారు. cతో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో గిల్ మెడ గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాలేదు. శనివారం గాయపడిన గిల్‌ను ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం.. అతన్ని మొదట ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లో ఉంచారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, అతను నడవగలుగుతున్నారని అలాగే మెడను కదపడానికి పెద్దగా ఇబ్బంది పడటం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ భారత కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసుపత్రిలో అతన్ని పరామర్శించి 15 నిమిషాలు మాట్లాడారు.
IND vs PAK: టోర్నీలో తొలి పరాజయం.. పాక్ చేతిలో టీమిండియా ఓటమి..!
ఈ పరిస్థితిని BCCI వైద్య బృందం పర్యవేక్షిస్తుంది. అయితే గిల్ నవంబర్ 22 నుండి గౌహతిలో ప్రారంభమయ్యే రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాల్గొంటాడా..? లేదా..? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. శుభ్‌మన్ గిల్ మెడ గాయాన్ని అంచనా వేస్తున్నామని, అతని పరిస్థితిపై ఫిజియో తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అలాగే ఫిజియోలు నేడు ఒక నిర్ణయం తీసుకుంటారని.. మేము రేపు నిర్ణయం తీసుకుంటామని గంభీర్ విలేకరులతో అన్నారు.
Ai Courses: ఉచిత AI కోర్సులను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం.. పూర్తి వివరాలు ఇవే
ఇక గిల్ లేకపోవడం దక్షిణాఫ్రికాకు కలిసివచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వారు భారత్‌ను 30 పరుగుల తేడాతో ఓడించారు. రెండు ఇన్నింగ్స్‌లలో స్పిన్నర్ సైమన్ హార్మర్ ఎనిమిది వికెట్లు పడగొట్టడం, టెంబా బావుమా అర్థ సెంచరీ ఈ మ్యాచ్‌లో భారత్, దక్షిణాఫ్రికా మధ్య ప్రధాన తేడాను చూపింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1-0 ఆధిక్యంలో ఉంది. ఈడెన్ గార్డెన్స్‌లో భారత్‌కు ఇది డిసెంబర్ 2012లో ఇంగ్లాండ్‌తో ఓటమి తర్వాత తొలి పరాజయం.