Shubhanshu Shukla: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ISS)కి ప్రయాణించిన మొదటి భారతీయ వ్యోమగామిగా శుభాంషుశుక్లా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఆయన తన మిషన్ సక్సెపుల్‌గా పూర్తి చేసుకొని తిరిగి భారత్ చేరుకున్నారు. గురువారం ఢిల్లీలోని మీడియా సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన అంతరిక్షంలోని తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు.
READ MORE: Botsa Satyanarayana: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ స్టాండ్ ఇదే.. క్లారిటీ ఇచ్చిన బొత్స
ముందుగా థ్యాంకు..
శుభాంషుశుక్లా మాట్లాడుతూ.. ముందుగా ఈ మిషన్‌కు తనను పంపినందుకు ప్రభుత్వానికి, ఇస్రోకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మిషన్ అనేక విధాలుగా విజయవంతమైందన్నారు. ఎక్సోమ్ మిషన్ అనుభవం, రాకెట్ టేకాఫ్ అయినప్పుడు కలిగే అనుభూతిని వర్ణించలేమన్నారు. అంతరిక్షంలో ప్రయాణించేటప్పుడు శరీరంలో మార్పులు వస్తాయని అన్నారు. అయితే ప్రతిదీ సరిగ్గా జరుగుతుందని, శరీరం తనకు తాను సర్దుబాటు చేసుకుని, 3 – 4 రోజుల్లో అంతరిక్షానికి అనుగుణంగా మారిపోతుందన్నారు. గతంలో కంటే ఇప్పుడు కాలం వేగంగా మారుతోందని, ఇప్పుడు పిల్లల కలల విస్తరించాయన్నారు. వాళ్లు వ్యోమగాములు కావడం గురించి ఆలోచిస్తున్నారని, వారి కలను సాకారం చేయడానికి ఇస్రో సిద్ధంగా ఉందని తెలిపారు. తాను అంతరిక్షంలోకి వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదని, కానీ మీరు కలలు కంటే, వెళ్లగలరని పిల్లలను ఉద్దేశించి చెప్పారు. అంతరిక్షం నుంచి భారతదేశం ఇప్పటికీ అందంగా కనిపిస్తుందని అన్నారు. అనంతరం ఆయన గగన్‌యాన్ మిషన్ గురించి మాట్లాడుతూ.. గగన్‌యాన్ మిషన్ అనేది ఇస్రో మానవ అంతరిక్ష మిషన్ అని అన్నారు. ఈ మిషన్ ద్వారా 2027లో ముగ్గురు వైమానిక దళ పైలట్‌లను అంతరిక్ష నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నట్లు తెలిపారు.
ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ మాట్లాడుతూ.. 10 ఏళ్ల క్రితం అంతరిక్ష రంగంలో తమకు ఒకే ఒక స్టార్టప్ కంపెనీ ఉండేదని అన్నారు. కానీ నేడు అంతరిక్ష పరిశ్రమలో 300 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఉన్నాయని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో, ఇస్రో ఆధ్వర్యంలో G-20 దేశాల కోసం G-20 ఉపగ్రహాన్ని నిర్మించామన్నారు. కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా అంతరిక్ష రంగానికి సంబంధించి కేంద్రం ఒక ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశీయ అంతరిక్ష రంగ ఆర్థిక వ్యవస్థ 8 మిలియన్ US డాలర్లని, ఇది భవిష్యత్తులో 45 మిలయన్ US డాలర్లు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
READ MORE: Food Colors: ఫుడ్ కలర్స్ వాడటంతో కలిగే నష్టాలేంటి..? నిపుణులు చేస్తున్నహెచ్చరికలేంటి ?