తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కూలీ. ఈ సినిమా సెట్స్ లో పాల్గొంటూ కొన్ని ఫోటోలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది శృతి.
కూలీ సెట్స్ లో బైక్ పై ఫోటోలకు ఫోజులిస్తూ హొయలు పోతుంది శృతి హాసన్
రజనీ కాంత్, ఉపేంద్ర, అక్కినేని నాగార్జున నటిస్తున్న ఈ సినిమాలో ప్రీతి అనే పాత్రలో కనిపించనుంది శృతి హాసన్ ఈ పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని తెలుస్తోంది.
గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ సినిమా షూటింగ్ తాజగా చెన్నై లో తిరిగి స్టార్ట్ చేసాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. శృతిహాసన్, రజనీకాంత్ కాంబినేషన్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.