Shruti Haasan : బ్రేకప్ తర్వాత స్పీడ్ తగ్గించిన శృతి హాసన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2023లో బాలకృష్ణ వీర సింహారెడ్డి, మెగాస్టార్ వాల్తేరు వీరయ్య, ప్రభాస్ సలార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో జోరు చూపించిన శృతి హాసన్ స్పీడ్‌పై దెబ్బేసింది తన లవ్ బ్రేకప్. 2024లో బాయ్ ఫ్రెండ్ శాంతను హాజరికాకు గుడ్ బై చెప్పిన శృతి హాసన్ పర్సనల్ లైఫ్ నుండి త్వరగానే బయటపడినప్పటికీ యాక్టింగ్ కన్నా.. సింగింగ్ టాలెంట్‌పై ఎక్కువగా కాన్‌సన్‌ట్రేట్ చేసింది. కాదలిక్క నేరమిల్లే, థగ్ లైఫ్ సినిమాల్లో పాటలు పాడిన శృతి.. ఆ తర్వాత వారణాసిలో పాటపాడటమే కాదు… టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఫంక్షన్‌లో స్పెషల్ ఫెర్ఫామెన్స్ ఇచ్చి సినిమాలు చేయట్లేదు అన్న లోటు పూడ్చుకుంది. గత ఏడాది కూలీలో రజనీతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రుతి నుండి ఇప్పటి వరకు మరో సినిమా రాలేదు. కొత్తగా ఓకే చేసిన సినిమాల గురించి కూడా చెప్పట్లేదు. ఎప్పుడో కంప్లీటైన ట్రైన్ థియేటర్స్‌లో రావడానికి మీన మేషాలు లెక్కిస్తుంటే.. సలార్2లో ఈమె ఉందా లేదా అన్న డౌట్స్ స్టార్టయ్యాయి.
Also Read : TheRajaSaab : అఫీషియల్ రాజాసాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసిన హాట్ స్టార్
Also Read
- MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్‌తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్‌పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
వీటన్నింటికి తన 40వ బర్త్ డేతో క్లారిటీ ఇచ్చేసింది. సలార్2లో శృతి ఉన్న విషయాన్ని ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ కన్ఫార్మ్ చేసింది మూవీ టీం. సలార్2 సెట్స్‌లో కలుద్దాం అంటూ బర్త్‌డే విషెస్ ట్వీట్ వేసింది. చాలా రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విజయ్ సేతుపతి – మిస్కిన్ సినిమా ట్రైన్ కూడా త్వరలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్. అయితే 65 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటి వరకు కోటి రూపాలు కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ చేయలేదట. సో ఈ సినిమా వస్తుందా రాదా అన్నది డౌటే. అలాగే చియాన్ విక్రమ్ 63లో హీరోయిన్‌గా ఫిక్సైనట్లు సమాచారం. అయితే దీని గురించి అఫీషియల్‌గా కన్‌ఫర్మేషన్ రావాల్సి ఉంది. సలార్ తర్వాత తెలుగులో కనిపించని శృతి హాసన్ సీక్వెల్ కన్నా ముందే మరో టాలీవుడ్ మూవీతో హాయ్ చెప్పబోతుంది. దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఓ తారలో నటిస్తోంది. బర్త్ డే సందర్భంగా ఆమె పోస్టర్ రిలీజ్ చేస్తూ విషెస్ తెలిపింది స్వప్నా సినిమాస్. ఇందులో సిగార్ కాలుస్తున్న శృతి లుక్ రివీల్ చేసింది టీం.
తాజావార్తలు
-
MLA Yarlagadda Venkata Rao: గన్నవరం ఎమ్మెల్యే గైర్హాజరుతో మళ్లీ చర్చ.. ఏటీసీ ప్రారంభోత్సవానికి ఎందుకు డుమ్మా..?
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్‌తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్‌పై WHO షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!