టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇటీవల వరుస హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. గత ఏడాది సలార్ సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. ఈ ఏడాదిలో హాయ్ నాన్న సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది.. ఆ సినిమా హిట్ అవ్వడంతో మరో హిట్ ను తన అకౌంట్ లో వేసుకుంది.. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.. ఓ సినిమాలో డీటేక్టివ్ గా కనిపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి..
అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ అమ్మడు సినీ కేరీర్‌ను చూస్తే హీరోయిన్ గానే కాదు.. సంగీత దర్శకురాలిగా, గాయనీగా, గీత రచయితగా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.. 14 ఏళ్ల వయస్సులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. లక్ అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. ఇలా ఒక్కో సినిమాతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. ప్రస్తుతం ఈ అమ్మడు హాలివుడ్ సినిమాల్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది..
చైన్నె స్టోరీ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్నారు. మొదట ఈ సినిమాలో సమంతను అనుకున్నా కూడా ఆమె అనారోగ్యం కారణంగా సినిమాను రిజెక్ట్ చేసింది. దాంతో ఆ ఛాన్స్ శృతిహాసన్ కు వచ్చింది.. అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్ అనే హాస్య నవల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో శృతిహాసన్ అనూ అనే లేడీ డిటెక్టీవ్‌గా నటిస్తున్నారు. కాగా ఈమె ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈమె హాలివుడ్ సినిమాలో నటించడం చాలా థ్రిల్ గా ఉందని చెప్పింది..