టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ.తన టాలెంట్ తో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలోనే రెండు భారీ బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకుందీ ఈ ముద్దుగుమ్మ.చిరంజీవి సరసన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో అలాగే బాలయ్య సరసన ‘వీరసింహారెడ్డి’ సినిమాలో నటించి భారీ సక్సెస్ ను సొంతం చేసుకుంది.శృతి హాసన్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.సలార్ సినిమాలో ఈ భామకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింది.అలాగే నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘హాయ్ నాన్న’ సినిమాలో ఈ భామ ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది.
ఈ భామ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా తెగ సందడి చేస్తోంది. తన అభిమానులకు నిత్యం టచ్ లోనే ఉంటూ ఎప్పడికప్పుడు తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది.అలాగే, బ్యూటీఫుల్ అవుట్ ఫిట్ లలో ఫొటోషూట్లు చేస్తూ తన ఫ్యాన్స్ ను ఎంతగానో అలరిస్తుంది.. కొంత కాలంగా గ్లామర్ షో కు దూరంగా వున్న శృతి హాసన్ తాజాగా డిఫరెంట్ అవుట్ ఫిట్లలో దర్శనమిస్తుంది.. ఈ క్రమంలోనే శృతి హాసన్ లేటెస్ట్ లుక్ బాగా వైరల్ గా మారింది.తాజాగా ఈ భామ బ్లాక్ అవుట్ ఫిట్ లో కిర్రాక్ పోజులిచ్చింది. స్టన్నింగ్ లుక్స్ తో అట్రాక్ట్ చేసింది. శృతి డ్రెస్సింగ్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.మరోవైపు శృతి టెంప్టింగ్ ఫోజులతో కట్టిపడేసింది. మత్తెక్కించే చూపులతో స్టిల్స్ ఇచ్చి మైమరిపించింది. శృతి హాసన్ క్రేజీ లుక్స్ చూసి నెటిజన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.