Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..
- ఏసు క్రీస్తు ‘‘ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్’’లో భారతీయ మూలాలు..
- క్రీస్తు మరణానంతరం కప్పిన వస్త్రంపై రీసెర్చ్..
- ఈ వస్త్రంలో భారతీయ డీఎన్ఏ..
- సింధూ లోయ నుంచి వచ్చినట్లు అభిప్రాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shroud Of Turin: ఏసు క్రీస్తుకు సంబంధించిన ‘‘ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్’’ మూలాలు భారతదేశంలో ఉన్నాయా?, ఏసు క్రీస్తుకు శిలువ వేసిన తర్వాత, ఆయన మరణించిన తర్వాత ఆయన శరీరంపై కప్పడానికి ఉపయోగించిన వస్త్రాన్ని ‘‘ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్’’గా వ్యవహరిస్తుంటారు. ఈ లెనిన్ వస్త్రం గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక డీఎన్ఏ అధ్యయనంలో షాకింగ్ విషయాలు తెలిశాయి.
పడోవా విశ్వవిద్యాలయానికి చెందిన జియానీ బార్కాసియా నేతృత్వంలోని పరిశోధకులు, 1978లో ‘ష్రౌడ్ ఆఫ్ ట్యూరిన్’ నుండి సేకరించిన నమూనాలను అధునాతన DNA సీక్వెన్సింగ్ పద్ధతులను ఉపయోగించి తిరిగి పరీక్షించారు. ఈ రీసెర్చ్‌లో వస్త్రంపై మొక్కలు, జంతువులు, భారతీయ మూలాలు కలిగిన వ్యక్తులకు సంబంధించిన డీఎన్ఏ ఆనవాళ్లు ఉన్నట్లుగా గుర్తించారు. పరిశోధకుల ప్రకారం, ఈ వస్త్రంలో కనిపించిన డీఎన్ఏలో సుమారు 40 శాతం భారతీయ వంశాలకు చెందినదిగా గుర్తించారు. దీని ఆధారంగా ఈ వస్త్రం భారత్‌లోని సింధూ లోయ ప్రాంతం నుంచి వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. రోమన్లు ఈ వస్త్రాన్ని భారత్ నుంచి తీసుకువచ్చి ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Also Read
Read Also: Good Friday: ఏసుక్రీస్తుకు శిలువ వేసిన రోజు.. గుడ్ ఫ్రైడే ఎందుకు ‘‘గుడ్’’..
1354లో ఫ్రాన్స్‌లో మొదటిసారిగా ఈ వస్త్రం గురించిన వివరాలను నమోదు చేశారు. ఇది 14.44 అడుగుల పొడవు, 3.61 అడుగుల వెడల్పు ఉంది. దీనికి సంబంధించిన రహస్యాలు ఇప్పటికీ పరిశోధకులకు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఇటలీలోని ట్యూరిన్ లో ఉన్న సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ కేథడ్రల్‌లో భద్రపరిచిన ఈ వస్త్రం, భారత్ నుంచి వచ్చి ఉండొచ్చని చెబుతున్నారు.
ఈ వస్త్రం శతాబ్ధాలుగా అనేక విభిన్న ప్రాంతాల్లో తిరిగిన కారణంగా దీనిపై పిల్లులు, కుక్కలు, జింకలు, కుందేళ్లు, కోళ్లు, మేకలు, గొర్రెలు, పందులు, గుర్రాలతో సహా అనేక జంతువుల డీఎన్ఏను గుర్తించారు. క్యారెట్లు, మిరపకాయలు, గోధుమల వంటి మొక్కల డీఏన్ఏ కూడా ఉంది. క్యూటిబాక్టీరియం, స్టెఫిలోకాకస్‌తో సహా మానవ చర్మ బ్యాక్టీరియా కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ కారణాల వల్ల ఈ వస్త్రానికి చెందిన ప్రాథమిక డీఎన్ఏను ఖచ్చితంగా గుర్తించడం కష్టమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తాజావార్తలు
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!