Shravana Masam 2023 Start Date and Time: హిందూ క్యాలెండర్ ప్రకారం.. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం తర్వాత ‘శ్రావణ మాసం’ వస్తుంది. భారత సంస్కృతీ సాంప్రదాయాల్లో శ్రావణ మాసంకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ మాసంలో నెల రోజుల పాటు మహిళలు లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు. ఉపవాసాలు ఉంటూ.. లక్ష్మీదేవిని ఎంతో నిష్ఠగా పూజిస్తారు. 2023 ఆగస్టు 17వ తేదీ నుంచి నిజ శ్రావణ మాసం ఆరంభం అయింది. ఈ శ్రావణ మాసం సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఉంటుంది.
శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో ప్రత్యేకమైనది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని ఆశీస్సులు పొందేందుకు అత్యంత అనుకూల సమయం అని అందరూ నమ్ముతారు. ఈ పర్వదినాన అమ్మవారికి పూజలు చేయడం వల్ల ఆరోగ్యం, ధనం, సంతాన సౌభాగ్యం లభిస్తుందని పండితులు చెబుతారు. ఈ శ్రావణ శుక్రవారం రోజున మహిళలు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. ఈ వ్రతంను ఇంట్లోనే చేసుకోవచ్చు.
తొలి శ్రావణ శుక్రవారాన ‘వరాలనొసగే’ వ్రతంను (Varalakshmi Vratham) శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో Bhakthi TV నిర్వహిస్తోంది. ఈ వ్రతంను లైవ్ ద్వారా చూసి.. మీరు కూడా ఇంట్లోనే చేసుకోండి.