Police on Sharddha Walker Case: 2020లో శ్రద్ధా వాకర్ చేసిన ఫిర్యాదు ఆధారంగా తాము దర్యాప్తు ప్రారంభించామని, అయితే కేసును ఉపసంహరించుకోవాలని ఆమె వ్రాతపూర్వక ప్రకటన ఇవ్వడంతో కేసును మూసివేసినట్లు మహారాష్ట్ర పోలీసులు బుధవారం తెలిపారు. తనకు, అఫ్తాబ్ పూనావాలాకు మధ్య వివాదం పరిష్కరించబడిందని శ్రద్ధా వాకర్ కేసు వెనక్కి తీసుకుందని పోలీసులు వెల్లడించారు. ఆ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ సమయంలో పోలీసులు చేశారు. ఫిర్యాదుదారు ఇచ్చిన దరఖాస్తును కూడా విచారించారు. విచారణ అనంతరం ఎలాంటి వివాదం లేదని ఫిర్యాదుదారు స్వయంగా రాతపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చారు. ఆమె స్నేహితుడి తల్లిదండ్రులు కూడా వివాదాన్ని పరిష్కరించడానికి ఆమెను పిలిచారు. ఆమె వ్రాతపూర్వక స్టేట్‌మెంట్ ఇచ్చిందని.. ఆ తర్వాత కేసు మూసివేయబడిందని డీసీపీ బావ్చే చెప్పారు.
శ్రద్దా వాకర్‌ను ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా 35 ముక్కలుగా నరికి హత్య చేశాడు. రిఫ్రిజిరేటర్‌లో దాచి మరీ ఆమె శరీర భాగాలను ఢిల్లీ సమీపంలోని అటవీ ప్రాంతంలో విసిరేశాడు. 2020లో మహారాష్ట్రలోని పాల్ఘర్‌లోని తులిన్జ్ పోలీస్ స్టేషన్‌లో శ్రద్ధా ఫిర్యాదు చేసిందని, అందులో అఫ్తాబ్ పూనావాలా తనను కొట్టాడని, చంపేస్తానని బెదిరించాడని మహారాష్ట్ర పోలీసులు తెలిపారు. నవంబర్ 23, 2020న తులింజ్ పోలీస్ స్టేషన్‌కు శ్రద్ధ ఫిర్యాదు లేఖ రాసినట్లు ధృవీకరించారు. అఫ్తాబ్ తనను చంపేస్తానని బెదిరించాడని, పోలీసుల దగ్గరకు వెళ్లే ధైర్యం తనకు లేదని శ్రద్ధా ఫిర్యాదు లేఖలో పేర్కొంది. అయితే, తాను లేఖ రాస్తున్న రోజే అఫ్తాబ్ తనను చంపేందుకు ప్రయత్నించాడని, ముక్కలు ముక్కలుగా నరికి విసిరేస్తానని బెదిరించాడని ఆమె పేర్కొంది. అఫ్తాబ్ తనను కొట్టాడని, చంపడానికి ప్రయత్నించాడని అఫ్తాబ్ తల్లిదండ్రులకు తెలుసునని లేఖలో పేర్కొన్నారు. తడి కుటుంబసభ్యులు ఉన్నారనే ధైర్యంతో తనతో ఉన్నానని.. కానీ వారికి తెలిసే తనను బాధపెట్టినట్లు ఆమె లేఖలో తెలిపింది. తనతో కలిసి ఉండాలని లేదని కూడా ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొంది. అయినప్పటికీ… మళ్లీ అతనితోనే ఆమె ఎందుకు ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. అప్పట్లో ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు.
Bombay Highcourt: మైనరే కానీ ఆమెకు అన్నీ తెలుసు.. అత్యాచార నిందితుడికి బెయిల్
ఐదు రోజుల పోలీసు కస్టడీ ముగియడంతో అఫ్తాబ్‌ను మంగళవారం దేశ రాజధానిలోని సాకేత్ కోర్టులో హాజరుపరిచారు. జరిగిన విషయం గురించి అని అఫ్తాబ్ కోర్టుకు చెప్పాడు. అఫ్తాబ్‌పై న్యాయస్థానం అనుమతించిన పాలిగ్రాఫ్ పరీక్ష నిన్న ప్రారంభించబడింది. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) అసిస్టెంట్ డైరెక్టర్ రోహిణి, సంజీవ్ గుప్తా మాట్లాడుతూ.. ఆఫ్తాబ్‌పై పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించే ప్రక్రియ ప్రారంభమైందని, వారం రోజుల్లో నివేదిక వెలువడుతుందని చెప్పారు.
