భారత్-బంగ్లాదేశ్ మధ్య గ్వాలియర్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 19.5 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్ల దాటికి బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. దీంతో భారత్ ముందు 128 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. బంగ్లా బ్యాటింగ్‌లో అత్యధికంగా మెహిది హసన్ మిరాజ్ (35*) పరుగులు చేశాడు. కెప్టెన్ షాంటో (27) పరుగులతో పర్వాలేదనిపించాడు. పర్వేజ్ హుస్సేన్ (8), హృదోయ్ (12), రిషద్ హుస్సేన్ (11), టస్కిన్ అహ్మద్ (12) పరుగులు చేశారు. భారత్ బౌలింగ్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే మయాంక్ యాదవ్ తన తొలి ఓవర్ను మెడిన్ చేసి రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా.. తన బౌలింగ్‌లో ఒక వికెట్ కూడా సంపాదించాడు. అత్యధికంగా వరుణ్ చక్రవర్తి 3, అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టారు. హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.
IND vs BAN: భారత్ ముందు స్వల్ప లక్ష్యం.. అదరగొట్టిన టీమిండియా బౌలర్లు
- 127 పరుగులకు బంగ్లాదేశ్ ఆలౌట్
- భారత్ ముందు 128 పరుగుల స్వల్ప లక్ష్యం
- అదరగొట్టిన టీమిండియా బౌలర్లు.
Show comments