Golden Temple: ఆలయం కాంప్లెక్స్‌లో కాల్పుల కలకలం.. యువకుడు ఆత్మహత్య

  • అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఓ యువకుడు ఆత్మహత్య
  • గన్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్న గుర్తు తెలియని వ్యక్తి
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.
Gun Fire

Gun Fire

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఓ యువకుడు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చాడని పోలీసులు కనుగొంటున్నారు. కాగా.. ఆలయ దర్శనానికి వచ్చిన ఓ వీఐపీ గన్‌మెన్‌ నుంచి పిస్టల్‌ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

Read Also: Satyapal Malik: మహారాష్ట్ర బీజేపీ “శవపేటిక”కు చివరి మేకు అవుతుంది.

×
×
Ad

కొంతమంది వీఐపీలు తమ భద్రతా సిబ్బందితో కలిసి గోల్డెన్ టెంపుల్‌కు దేవుడిని దర్శనం చేసుకునేందుకు వచ్చారు. వీఐపీలు స్వర్ణ దేవాలయం లోపలికి వెళ్లగా, వారి భద్రతా సిబ్బంది బయట కారిడార్‌లో నిల్చున్నారు. ఈ సమయంలో ఓ యువకుడు అక్కడికి వచ్చి గన్‌మెన్‌ పిస్టల్‌ లాక్కొని కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల శబ్ధం వినడంతో అక్కడి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. యువకుడు టెంపుల్ ఎదురుగా ఉన్న స్థలంలో సూసైడ్ చేసుకున్నాడు.

Read Also: Sri Sri Ravi Shankar : తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన శ్రీశ్రీ రవిశంకర్

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వలసదారుడని పోలీసులు తెలిపారు. మృతుడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. యువకుడు ఎక్కడి నుంచి వచ్చాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం నిమిత్తం అమృత్‌సర్‌ సివిల్‌ ఆస్పత్రికి తరలించారు.