Bhuvanagiri Student: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య కలకలం రేపింది. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్‌లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. అయితే.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఆరుగురు పైన కేసులు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. వార్డెన్ శైలజ.. ఆటో డ్రైవర్ ఆంజనేయులు.. వంట మనుషులు సుజాత, సులోచన ..పిఈటి ప్రతిభ.. ట్యూషన్ టీచర్ భువనేశ్వరి పై కేసు నమోదు చేశారు. వార్డెన్ తో పాటు ఆటో డ్రైవర్ని విచారిస్తున్నారు. పోస్టుమార్టం సందర్భంగా పిల్లల ఒంటిపై గాయాలు గుర్తించారు. దీంతో గాయాలకు సంబంధించిన ఫోటోలను కుటుంబ సభ్యులు బయటికి విడుదల చేశారు. పిల్లలపై ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉరివేసుకుని విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడితే మరి ఒంటిపై గాయాలు ఎలా వచ్చాయంటూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లల కడుపు, చేతులు, మొడలపై పళ్ల ఘాట్లు వున్నట్లు పోస్టుమార్టంలో తేలిందని, ఇది తప్పకుండా యాజమన్యం సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.
Read also: Supreme Court: చండీగఢ్ మేయర్ ఎన్నికలపై సుప్రీంకోర్టులో నేడు విచారణ
అభం శుభం తెలియని పిల్లలకు అమానుషంగా ప్రవర్తించి చంపేశారని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పిల్లలపై ఇలాంటివి జరుగుతున్నా న్యాయం చేసేవారు కరువయ్యారంటూ మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పిల్లలపై ఇంత అమానుషంగా ప్రవర్తించి చావకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. మరోవైపు సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సూసైడ్ లెటర్ లో పలు అంశాలను విద్యార్థులు ప్రస్తావించిన విషయం తెలిసిందే.. హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన బాలికలు భువనగిరిలోని రెడ్డివాడ బాలికల ఉన్నత పాఠశాలలో హాస్టల్‌లో ఉంటూ 10వ తరగతి చదువుతున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. హాస్టల్ గదిలోనే ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆ గదిలో నుంచి సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో పేర్కొన్న అంశాలను చదివి పోలీసులు ఆశ్చర్యపోయారు. ‘మేము వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి.. మేం తప్పు చేయకపోయినా అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు తీసుకోలేకపోతున్నాం. మమ్మల్ని మా శైలజ మేడం తప్ప ఎవరూ నమ్మలేదు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నాం. మా ఇద్దరినీ ఒకచోటే సమాధి చేయండి’ అని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. దీని ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
Paytm : పేటీఎం ఖేల్ ఖతం.. రూ.20500కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు