Site icon NTV Telugu

Pune: డెలివరీ బాయ్‌గా నటిస్తూ ఫ్లాట్‌లోకి ప్రవేశించి.. ఒంటరిగా ఉన్న యువతిని ఏం చేశాడంటే..!

Uprape

Uprape

పూణే కోంధ్వా ప్రాంతంలోని ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. కొరియర్ డెలివరీ బాయ్‌గా నటిస్తూ ఓ ఫ్లాట్‌లోకి ప్రవేశించిన వ్యక్తి 22 ఏళ్ల యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన బుధవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.

READ MORE: Ramchander Rao: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆరోజే బాధ్యతలు స్వీకరించనున్న రామచంద్రరావు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె సోదరుడు ఏదో పని మీద బయటకు వెళ్లాడు. ఓ వ్యక్తి తలుపు తట్టాడు. తాను డెలివరీ బాయ్ అని పరిచయం చేసుకుని బ్యాంకు నుంచి ఒక లేఖ వచ్చిందని చెప్పాడు. ఆమెకు ఇస్తూ.. ఓ సంతకం చేయమని చెప్పాడు. తన దగ్గర పెన్ను లేదని ఆ వ్యక్తి చెప్పడంతో ఆమె పెన్ను తీసుకురావడానికి గదిలోకి వెళ్ళింది. నిందితుడు ఫ్లాట్ లోనికి ప్రవేశించి.. తలుపును లోపలి నుంచి లాక్ చేశాడు. ఆమెను వెంట గదిలోకి వెళ్లి గుర్తు తెలియని మందును స్ప్రే చేశాడు. ఆ యువతి గట్టిగా అరిచింది. అనంతరం కొద్ది సేపటికే స్పృహ కోల్పోయింది. ఆపై నిందితుడు 21 ఏళ్ల యువతిపై అత్యాచారం చేశాడు. కొన్ని గంటల తరువాత బాధితురాలు స్పృహలోకి వచ్చింది. నిందితుడు ఆమె ఫోన్ లో సెల్ఫీ తీసుకుని “నేను మళ్ళీ వస్తాను”(I will come again) అని దానిపై రాసినట్లు బాధితురాలు తెలిపింది.

READ MORE: India- Pakistan: భారత్‌కు రానున్న పాకిస్థాన్ జట్టు.. క్రీడా మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్..!

వెంటనే ఆ యువతి పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు, ఫోరెన్సిక్ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులు ఏదో రసాయన స్ప్రేను ఉపయోగించి ఉండవచ్చని దర్యాప్తులో తేలిందని డీసీపీ షిండే తెలిపారు. ప్రస్తుతం, పూణే పోలీసులకు చెందిన 10 బృందాలు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 64, 77 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సొసైటీ, పరిసర ప్రాంతాలలోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Exit mobile version