Shocking Incident: ఈ మధ్య కాలంలో రైలు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య ఎక్కవుతుంది. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇలాంటి మరో సంఘటన హౌరా నుంచి రిషికేశ్ వెళ్లే డూన్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. టికెట్ తనిఖీకి వెళ్లిన టీటీఈకి దారుణ సంఘటన ఎదురైంది. ఇందుకు సంబంధించిన ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఉన్న చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో స్లీపర్ బోగీ S-3లో అనధికారికంగా ప్రయాణిస్తున్న కొందరు మహిళలు సీటు ఖాళీ చేయమని అడిగిన టీటీఈపై దాడి చేశారు. ఈ ఘటనపై టీటీఈ చార్‌బాగ్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. రైల్వే యంత్రాంగం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని తెలిపింది.
Siddu Jonnalagadda : ఆ హీరోనే నా ఫేవరెట్.. తెలుగు హీరోలకు షాక్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ
ఈ సంఘటన ఉత్తర రైల్వే లక్నో డివిజన్‌లోని చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌లో జరిగింది. హౌరా నుండి రిషికేశ్ వెళ్లే రైలు నంబర్ 13009 డూన్ ఎక్స్‌ప్రెస్ గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. లక్నో రాకముందే టీటీఈ దివాకర్ మిశ్రా రైలులోని స్లీపర్ బోగీ S-3లో టికెట్ తనిఖీ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ తనిఖీ సమయంలో, ఒక ప్రయాణికుడు తమ సీటులో అనధికారికంగా ఉన్న ప్రయాణికులపై సోషల్ మీడియా ‘X’ (గతంలో ట్విట్టర్) ద్వారా ఫిర్యాదు చేసి, వెంటనే సీటు ఖాళీ చేయించాలని అభ్యర్థించారు.
Wines Tender : ఒక్కరోజే 10 వేల దరఖాస్తులు.. ఇంకా రెండు రోజులే గడువు
ఈ విషయమై టీటీఈ దివాకర్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన సీటు నంబర్ నాలుగు ఖాళీ చేయించడానికి వెళ్లగా, ఆ సీటులో కూర్చున్న మహిళలు కోపంతో ఆయనపై విరుచుకుపడ్డారు. ఆ మహిళలు దూషణలు మొదలుపెట్టి, టీటీఈ చొక్కా చింపివేశారు. అంతేకాకుండా ఆయనను కొట్టి, ఆయన ముఖంపై టీ కూడా విసిరేశారు. మహిళా ప్రయాణికులు తన బంగారు గొలుసు కూడా తెంపేశారని దివాకర్ మిశ్రా చెప్పారు. ఈ వ్యవహారంపై చార్‌బాగ్ జీఆర్‌పీలో ఫిర్యాదు నమోదైంది. మహిళలు జనరల్ టికెట్ తీసుకొని స్లీపర్ బోగీలో ప్రయాణిస్తున్నారని, ఇది అనధికార ప్రయాణం అని రైల్వే యంత్రాంగం తెలిపింది. టీటీఈ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తర్వాత, ఆ మహిళలను బారాబంకి రైల్వే స్టేషన్‌లో దింపేసినప్పటికీ.. వారు మళ్లీ బోగీలోకి ప్రవేశించారు. ఆ తరువాత రైలు చార్‌బాగ్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నప్పుడు వారిని కిందకు దింపి వారిపై జీఆర్‌పీలో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.