Site icon NTV Telugu

Teenmaar Mallanna: తీన్మార్ మల్లన్నకు షాక్.. కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్

Teenmar Mallanna

Teenmar Mallanna

ఎమ్మెల్సీ చింతపండు నీవన్ (తీన్నార్ మల్లన్న)కు బిగ్ షాక్ తగిలింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ కుల గణన తప్పు అని.. పేపర్ తగలపెట్టినందుకు పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి సస్పెన్షన్ ఆర్డర్స్ జారీ చేశారు. ఈ అంశంపై ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని ఫిబ్రవరి 5న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో మల్లన్న స్పందించకపోవడంతో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. కాగా.. పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు ఉంటాయని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తెలిపారు.

Read Also: CPM Raghavulu: డీలిమిటేషన్‌పై అమిత్ షా వ్యాఖ్యలు మోసపూరితం

ఈ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందిస్తూ.. ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పని మొదలుపెట్టారని అన్నారు. నిన్న గాంధీభవన్‌కు వచ్చిన ఆమె.. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారని తెలిపారు. పార్టీ లైన్ ఎవరు దాటినా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. పార్టీ లైన్ తప్పి వ్యవహరించిన వారిపై చర్యలకు ఆదేశిస్తామని చెప్పారు. ఓ వర్గాన్ని అవమానించినందుకు సస్పెండ్ చేయలేదని.. పార్టీ చేసిన సర్వే, సర్వే కాపీలను చింపినందుకు సస్పెండ్ చేసినట్లు మహేశ్ గౌడ్ తెలిపారు.

Exit mobile version