తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మరో నాటకానికి తెర దీసింది అని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మం మీటింగ్ సందర్భంగా బీఆర్ఎస్ అరాచకాలు చేసింది.. బీఆర్ఎస్ అరాచకం వల్లనే సభ గ్రాంఢ్ సక్సెస్ అయ్యింది అని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వున్న కిషన్ రెడికే బీజేపీ అధ్యక్షుడిగా బీజేపీ హైకమాండ్ నియమించింది అని తెలిపింది. ఇదే బీఆర్ఎస్, బీజేపీ అనుబందంపై పూర్తిగా అర్థమవుతుందని రేణుకా చౌదరి చెప్పారు. బీఆర్ఎస్ కు కరెంట్ షాక్ తగులనుంది.. తెలంగాణలో బీజేపీ నామా రూపాలు లేకుండా పోతుందని ఆమె పేర్కొన్నారు.
Read Also: Heavy Rains: ఉత్తరాదిని వణికిస్తున్న వర్షాలు.. పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు షాక్ తప్పదు అని రేణుకా చౌదరి అన్నారు. కేంద్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయి అంటూ ఆమె చెప్పారు. దాదాపు 100 సీట్లు బీజేపీకి తగ్గనున్నాయి.. ఈడీ, సీబీఐలను రంగ ప్రవేశం చేస్తుంది అని తెలిపింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు గుడికి వెళ్ళాలంటే పర్మిషన్ అవసరమా.. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో ఎటువంటి వర్గవిభేదాలు లేవు అని ఆమె స్పష్టం చేశారు. తాను ఏపీ, తెలంగాణలో ఎక్కడ నుంచి అయిన పోటీ చేయవచ్చు అని రేణుకాచౌదరి తెలిపారు.
Read Also: Uttarakhand: అదుపుతప్పి నదిలోకి వాహనం.. ఆరుగురు గల్లంతు..
పార్లమెంట్ అసెంబ్లీ అనేది అధిష్ఠానం నిర్ణయం.. రాజ్యాంగం అలా అవకాశం ఇచ్చింది.. ఖమ్మం జిల్లాను జలగం వెంగళరావు తరువాత అంత అభివృద్ధి చేసింది రేణుకాచౌదరి మాత్రమే.. అది రేణుకాచౌదరి పొగరు, పౌరుషం అంటూ ఆమె అన్నారు. పాలేరులో షర్మిలకు అవకాశం ఇవ్వమని పబ్లిక్ ఒపీనియన్ చెబితే నేను సంతోషంగా తప్పుకుంటాను.. షర్మిల పార్టీలోకి వచ్చే దాని గురించి నేను ఆలోచించడం లేదు.. రాష్ట్రం మొత్తం వదిలేసి పాలేరులోనే ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపుతుందో నాకు అర్థం కావడం లేదున్నారు. పూర్వ జన్మ సుకృతం వల్ల ఖమ్మం జిల్లాకు వచ్చాను.. నేను పొంగులేటికి వ్యతిరేకంగా లేను అని రేణుకాచౌదరి తెలిపారు.
Read Also: Passion Fruit : పాషన్ ఫ్రూట్ అనే ఈ జ్యూస్ గురించి తెలుసా..?
అయితే.. కారేపల్లి మండలం.. భాగ్యనగర్ తండాలో మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పలు పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్లు రేణుకాచౌదరి చెప్పుకొచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో సమస్యల పరిస్కారం కోసం సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు అండగా కాంగ్రెస్ పార్టీ తరఫున జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య సంఘీభావం తెలిపారు. అయితే.. తమను అధిష్ఠానం ఎక్కడ నుంచి పోటి చేయమంటే అక్కడ నుంచి పోటి చేస్తాను అని మరోసారి రేణుకాచౌదరి పేర్కొన్నారు.