Kannappa : కన్నప్ప సినిమా లో నటించబోతున్న శివరాజ్ కుమార్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.భారీ తారాగణం తో బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా గా ఈ సినిమా తెరకెక్కుతుంది.. న్యూజిలాండ్ లో ఇటీవలే కన్నప్ప షూటింగ్ కూడా ప్రారంభం అయింది..పలువురు పాన్ ఇండియా హీరోలు ఈ సినిమా లో భాగస్వామ్యం కాబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. తాజాగా మరో పాన్ ఇండియా స్టార్ కూడా కన్నప్పలో నటించబోతున్నాడనే వార్త తెగ వైరల్ అవుతుంది.ఆ పాన్ ఇండియా స్టార్ ఎవరో కాదు..ఇటీవలే జైలర్ లో నరసింహ పాత్ర లో నటించిన శివరాజ్‌కుమార్. ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర లో కనిపించబోతున్నాడన్న వార్త తెగ వైరల్ అవుతుంది.. ఈ క్రేజీ వార్తల పై మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే లేదు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, మధుబాల కీలక పాత్రలో నటిస్తున్నట్టు ఇప్పటికే అప్‌డేట్స్ కూడా వచ్చాయి.తాజాగా ఈ కన్నడ సూపర్ స్టార్ కూడా కన్నప్ప టీంతో జాయిన్ కాబోతున్నాడన్న వార్తలతో సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి.. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అలాగే స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించనున్నారు. రానున్న రోజుల్లో కన్నప్ప సినిమా నుంచి మరిన్ని సర్ప్రైస్ లు అందించనుంది మంచు విష్ణు టీం.అయితే ఈ సారి మంచు విష్ణు కన్నప్ప వంటి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాల చాలా గట్టిగా ఫిక్సయినట్టు వరుస అప్డేట్స్ తోనే తెలుస్తుంది. మరి ఈ సినిమా తో విష్ణు కెరీర్ బెస్ట్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..