Site icon NTV Telugu

Maharashtra: బీజేపీకి బిగ్ షాక్.. మేయర్‌ పదవి కోసం ఒక్కటైన షిండే శివసేన, రాజ్‌ఠాక్రే..

Maharashtra

Maharashtra

Maharashtra: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి సత్తా చాటింది. దేశంలో అత్యంత ధనిక మున్సిపల్ కార్పొరేషన్ అయిన ముంబై మేయర్ పీఠాన్ని బీజేపీ, శివసేనలు కలిసి దక్కించుకునే అవకాశం ఏర్పడింది. అయితే, ముంబైతో పాటు పలు కార్పొరేషన్‌లలో బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య మేయర్ పదవి కోసం ప్రతిష్టంభన ఏర్పడింది. ఇప్పటికే, ముంబై మేయర్ పదవి కోసం షిండే సేన బీజేపీపై ఒత్తిడి తీసుకువస్తోంది.

Read Also: ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది 2’ గ్యాంగ్‌లో ఊహించని ట్విస్ట్.. ఆ కీలక నటుడు అవుట్?

ఇదిలా ఉంటే, ప్రస్తుతం కళ్యాణ్-డొంబివ్లిలో రాజకీయం రసవత్తరంగా మారింది. ఏక్‌నాథ్ షిండే శివసే, బద్ధ శత్రువైన రాజ్‌ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సే(ఎంఎన్ఎస్)తో పొత్తు పొట్టుకుంది. బీజేపీకి మేయర్ పదవి దక్కకుండా రెండు పార్టీలు కలిసి అడ్డుకున్నాయి. 122 మంది సభ్యులు ఉన్న కళ్యాన్-డొంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్(కేడీఎంసీ) ఎన్నికల్లో బీజేపీకి 50, షిండే సేనకు 53, ఎంఎన్ఎస్‌కు 05, ఉద్ధవ్ ఠాక్రే శివసేన యూబీటీకి 11 స్థానాలనున గెలుచుకుంది. కేడీఎంసీని దక్కించుకోవడానికి మ్యాజిక్ ఫిగర్ 62.

అయితే, శివసేన-బీజేపీలు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వాములు అయినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం మేయర్ పదవుల్ని దక్కించుకోవడానికి పొరాడుతున్నాయి. బుధవారం కొంకణ్ భవన్‌లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం తర్వాత, శివసేన ఎంపీ మరియు ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్, రాజ్ థాకరే పార్టీతో పొత్తును ధృవీకరించారు. ఇది వారి బలాన్ని 58కి పెంచుతుంది. ఉద్ధవ్ వర్గం నుంచి మరో నలుగురు కార్పొరేటర్లు ఈ కూటమిలో చేరవచ్చని శ్రీకాంత్ చెప్పారు. ఈ పరిణామాలు బీజేపీతో అధికారాన్ని పంచుకునే పరిస్థితి లేకుండా చేసింది.

Exit mobile version