NTV Telugu Site icon

Sheikh Hasina: ప్రభుత్వ పతనానికి అమెరికా కారణం.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు

Pm Sheikh Hasina

Pm Sheikh Hasina

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తమ ప్రభుత్వ పతనానికి అమెరికా కారణమని ఆరోపించారు. బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు వీలుగా ఉన్న సెయింట్ మార్టిన్ ద్వీపాన్ని అమెరికాకు అప్పగించనందుకే తనను అధికారం నుంచి తప్పించారని హసీనా ఆరోపించారు. ఛాందసవాదుల వల్ల తప్పుదోవ పట్టవద్దని బంగ్లాదేశ్ పౌరులకు ఆయన విజ్ఞప్తి చేశారు. షేక్ హసీనా ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారని తెలిసిందే.

READ MORE: DoubleiSmart: ప్లీజ్ నాలాగా ఎవరూ చేయకండి : రామ్ పోతినేని

ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. “నేను మృతదేహాల ఊరేగింపును చూడకుండా ఉండటానికి రాజీనామా చేశాను. విద్యార్థుల మృత దేహాలపై అధికారంలోకి రావాలని వారు కోరుకున్నారు. కానీ నేను దీనిని అనుమతించలేదు. సెయింట్ మార్టిన్ దీవి సార్వభౌమాధికారాన్ని అమెరికాకు అప్పగించి బంగాళాఖాతంలో తన ఆధిపత్యాన్ని నెలకొల్పేందుకు అనుమతి ఇచ్చి ఉంటే నేను అధికారంలో ఉండగలిగేదాన్ని. నా దేశ ప్రజలను నేను అభ్యర్థిస్తున్నాను.” అని ఆమె పేర్కొన్నారు.

READ MORE:Big Battery Smartphones: ఛార్జింగ్‌ కష్టాలకు చెక్‌.. ‘బిగ్‌ బ్యాటరీ’తో రానున్న షావోమీ స్మార్ట్‌ఫోన్స్!

“నేను ఇంకా దేశంలో ఉండి ఉంటే, ఎక్కువ మంది ప్రాణాలు పోయేవి. మరిన్ని వనరులు, ప్రజా ఆస్తులు దెబ్బతినేవి. మీరు నన్ను ఎన్నుకున్నారు.. కాబట్టి నేను నాయకురాలిని అయ్యాను. మీరే నా బలం. నా పార్టీ అవామీ లీగ్‌కు చెందిన పలువురు నాయకులు హత్యకు గురయ్యారని, కార్యకర్తలపై వేధింపులకు గురవుతున్నారు. వారి ఇళ్లను తగులబెట్టారని వార్తలు వస్తున్నాయి. అవి చూసి నా గుండె రోదిస్తున్నది. అల్లా దయతో నేను త్వరలో తిరిగి వస్తాను. సవాళ్లతో పోరాడిన తర్వాత అవామీ లీగ్ మళ్లీ నిలబడేలా చేస్తాను. బంగ్లాదేశ్ భవిష్యత్తు కోసం అల్లాను ప్రార్థిస్తున్నాను. నా గొప్ప తండ్రి కలలు కన్న, దాని కోసం కృషి చేసిన దేశం. నా తండ్రి, కుటుంబం తమ ప్రాణాలను అర్పించిన దేశం.” అని మాజీ ప్రధాని షేక్ హసీనా భావోద్వేగానికి గురయ్యారు.