DoubleiSmart: ప్లీజ్ నాలాగా ఎవరూ చేయకండి : రామ్ పోతినేని
- రామ్ -పూరి ల లేటెస్ట్ రిలీజ్ డబుల్ ఇస్మార్ట్
- ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
- డబుల్ ఇ"స్మార్ట్' లుక్ లో రామ్ పోతినేని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. గతంలో వీరి కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సిక్వెల్ గా రానుంది డబుల్ ఇస్మార్ట్. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి జగన్నాధ్ ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమాలో చాక్ లెట్ బాయ్ గా కనిపిస్తున్నాడు రామ్ పోతెనేని. స్కంద సినిమాలో కండలు తిరిగిన రామ్ ని చుసిన ఆడియెన్స్ డబుల్ ఇ’స్మార్ట్’ లుక్ చూసి షాక్ అయ్యారు. ఇంత తక్కువ గ్యాప్ లో స్లిమ్ గా ఎలా మారాడు ఇదెలా సాధ్యమైంది అని ఆరాలు తీయడం మొదలు పెట్టారు.
Also Read: Thangalaan: ‘తంగలాన్’ మొత్తం ఎన్ని భాగాలుగా రానుందో తెలుసా..?
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
వీటన్నిటికీ సమాధానంగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న పిక్స్ షేర్ చేసాడు ఎనర్జిటిక్ స్టార్. ఈ పిక్స్ లో తన తాజా లుక్ కోసం జిమ్, స్టీమ్ సెషన్‌లు తీసుకున్నానంటూ రాసుకొచ్చాడు రామ్. అదే విధంగా డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్ లో భాగంగా గెటప్ శ్రీనుతో ఇంటర్వ్యూ లో హీరో రామ్ తన లుక్ కు సంబంధించి మరి కొన్ని విషయాలు పంచుకున్నారు. స్కంద పూర్తయ్యేసరికి 86 కిలోల బరువు ఉన్న రామ్, డబుల్ ఇస్మార్ట్ సెట్స్ పైకి వచ్చేసరికి 68 కిలోలకు తగ్గాడు. రామ్ మాట్లాడుతూ ” పూరి జగన్నాథ్ చెప్పిన క్లైమాక్స్ కిక్ ఇచ్చింది. ఇస్మార్ట్ శంకర్ క్లైమాక్స్ లాగే డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్ లో కూడా షర్ట్ లేకుండా చేయాలని అనుకున్నాం. ఆ క్లైమాక్స్ పార్ట్ నవంబర్ లోనే షూట్ చేయాలి. స్కంద రిలీజైన తర్వాత నాకు 2 నెలలు మాత్రమే టైమ్ ఉంది. దాంతో వెంటనే బాలిలో ఓ ప్రాంతానికి వెళ్లి అక్కడే నెల రోజులుండి తీవ్రంగా వర్కవుట్ చేసి బరువు తగ్గాను” అని రామ్ తెలిపాడు. అయితే ఇలా తక్కువ టైమ్ లో బరువు తగ్గడం ఆరోగ్యానికి ప్రమాదకరమని, తనలా ఎవ్వరూ ప్రయత్నించొద్దని కూడా సూచిస్తున్నాడు ‘బెజవాడ కుర్రోడు రామ్’ .
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!