Site icon NTV Telugu

Shehbaz Sharif: నేడు పాక్ ప్రధానిగా తప్పుకోనున్న షెహబాజ్ షరీఫ్

Shehbaz Sharif

Shehbaz Sharif

ఈ ఏడాది చివరల్లో పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎక్కువ సమయం తీసుకునేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని నిర్ణయించుకుంది. అయితే, ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ రాజీనామా చేసే అవకాశం ఉంది. దీంతో పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని నేడు ముందస్తుగా రద్దు అవుతుంది. అయితే, వాస్తవానికి పార్లమెంటు దిగువ సభ ఐదేళ్ల పదవీకాలం ఆగస్టు 12తో ముగుస్తుంది. కానీ దానికి నాలుగు రోజులు ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ రాష్ట్రపతి దానికి ఆమోదం తెలిపితే 48 గంటల్లోగా అసెంబ్లీ రద్దు అవుతుంది.

Read Also: Mega Fans: ఒక్కటైన కొణిదెల కొదమసింహాల అభిమానులు… విధిరాతకి-ఎదురీతకి దోస్తీ

కాగా.. షెహబాజ్ షరీఫ్ ప్రధాని పదవి నుంచి వైదొలుగుతారన్న సంకేతాలతో రావల్పిండిలోని పాక్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్ కు గుడ్ బై చెప్పారు. ప్రధాని షరీఫ్ మంగళవారం జనరల్ హెడ్ క్వార్టర్స్ కు వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. పీఎంఎల్-ఎన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మరో రెండు రోజుల తర్వాత (ఆగస్టు 11) పార్లమెంటును రద్దు చేయాలని అనుకుంది.. కానీ ప్రధాని రాజీనామా చేసిన వెంటనే దానికి రాష్ట్రపతి అల్వీ ఆమోద ముద్ర వేసిన.. వెంటనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ పరిశీలకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Read Also: Pawan Kalyan: అడవి బిడ్డలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలి

నిజానికి అసెంబ్లీ రాజ్యాంగ కాలపరిమితి పూర్తైన 60 రోజుల్లోగా ఈసీపీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ కొత్త జనాభా గణనను సమాఖ్య యూనిట్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి నియమించిన రాజ్యాంగ సంస్థ కౌన్సిల్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ ఆమోదించినందున.. 90 రోజులైన ఎన్నికలకు సరిపోకపోవచ్చు అనే వాదన వినిపిస్తుంది. దాని ఆమోదం తర్వాత ఎన్నికలు జరిపే బాధ్యత ఈసీపీపై ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read Also: Bhola Shankar Movie: భోళా శంకర్‌కి చివరి నిమిషంలో చిక్కులు.. నిర్మాతలపై కోర్టు కేసు!

వచ్చే సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగే ఛాన్స్ ఉందని అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా పేర్కొన్నారు. 2023 ఎన్నికల ఏడాది కాదు అని ఆయన అన్నారు. కాగా.. అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ ఆపద్ధర్మ ప్రధాని పేరును మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే ప్రభుత్వం, మిత్రపక్షాలు అభ్యర్థి కోసం గాలిస్తున్నట్టు సమాచారం. ఇవాళ సాయంత్రం వరకు అభ్యర్థిని ఖరారు చేసే ఛాన్స్ ఉంది. అయితే ఎవరి పేరును ప్రతిపాదించకపోతే రాజ్యాంగబద్ధంగా ప్రస్తుత ప్రధాని కేర్ టేకర్ గా కొనసాగుతారు.

Exit mobile version