Site icon NTV Telugu

SP Sirisha : హైదరాబాద్ ఇంటలిజెన్స్ ఎస్పీగా శిరీష

Sp Sirisha

Sp Sirisha

హైదరాబాద్ షీటీమ్స్, భరోసా అడిషనల్ డీఎస్పీ శిరీష బదిలీ అయ్యారు. హైదరాబాద్ ఇంటలిజెన్స్ ఎస్పీ గా శిరీషను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. హైదరాబాద్ షీటీమ్స్ లో రెండు సంవత్సరాలకు పైగా శిరీష పనిచేశారు. షీటీమ్స్ లో శిరీష పనితీరును పలుమార్లు ఉన్నతాధికారుల అభినందించారు. అయితే.. మహిళ రక్షణ కోసం అనేక సేవలందించిన శిరీష… ప్రేమ పేరుతో మోసాలు.. మహిళలు, అమ్మాయిలపై వేధింపులకు పాల్పడ్డ అనేక మంది పై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు.

Also Read : Gunfire In USA : అమెరికాలో మరోమారు పేలిన గన్.. ముగ్గురు స్పాట్ డెడ్

షీ టీంకు వచ్చిన ప్రతి ఫోన్ కాల్ కు తక్షణ స్పందించి ఎంతోమంది అమ్మాయిలకు రక్షణ కల్పించిన ఆమె.. వేధింపుల కేసులో అనేక మంది నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు. మహిళల వేధింపుల కేసుల్లో అరెస్ట్ అయిన నిందితులకు శిక్షలు విధించిన కోర్టు. శిరీష బదిలీ కావడంతో.. షీటీమ్స్ సిబ్బంది ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికారు.. ఆమె సేవలను గుర్తు చేసుకొని సిబ్బంది ఆమెను అభినందించారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 41 మంది డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)లను శనివారం తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్ (డీజీపీ) అంజనీకుమార్ బదిలీ చేసి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు.

Also Read : Vande Bharat: వందే భారత్ రైళ్లో ‘చెత్త పద్ధతి’ మార్చండి.. కేంద్రమంత్రి సూచన

Exit mobile version