Shaving vs Trimming: ఈ రెండింటిలో మీ చర్మానికి ఏది మంచిది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shaving vs Trimming: కొత్తగా గడ్డం వచ్చిన యువకులు షేవింగ్ లేదా ట్రిమ్మింగ్ ఏది మంచిది.. అంటూ తరచుగా గందరగోళానికి గురవుతారు. హెయిర్ స్టైలింగ్ అనేది పురుషులకు ఎంత ముఖ్యమో మహిళలకు కూడా అంతే ముఖ్యం. అటువంటి పరిస్థితిలో, మీరు యుక్తవయసులో ఉండి, మొదటిసారిగా కొత్త గడ్డం తీయాలని కోరుకుంటే, షేవింగ్ చేయాలా లేదా కత్తిరించాలా అని అయోమయంలో ఉంటే అప్పుడు ఈ కథనం మీ కోసం మాత్రమే. ట్రిమ్ చేసేటప్పుడు లేదా షేవింగ్ చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి.
షేవింగ్ అంటే ఏమిటి?
రేజర్‌ను షేవింగ్ కోసం ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో బ్లేడ్ల సహాయంతో గడ్డాన్ని తీసేయవచ్చు. షేవింగ్ చేస్తే చర్మం మృదువుగా మారుతుంది, అంటే దానిపై జుట్టు కనిపించదు. అదనంగా ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. తద్వారా ముఖంపై పేరుకుపోయిన చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది. ట్రిమ్ చేయడంతో పోలిస్తే జుట్టు తిరిగి పెరగడానికి ఎక్కువ సమయం పడుతుంది.
Also Read
- Under -19 Asia Cup: టెయిలెండర్ల అద్భుతం.. పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఆసియా కప్ కొట్టేసిన భారత్..
- Rahul Gandhi : ఫాసిస్టు శక్తులను తరిమికొడతాం.. హైదరాబాద్ వేదికగా రాహుల్ గాంధీ పిలుపు
- Vigilance Raids: అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం.. రూ. 10.43 కోట్ల సరుకు స్వాధీనం..
- SP-Congress Alliance: 200కు పైగా సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. నవంబర్ 17న అఖిలేశ్‌తో కీలక భేటీ!
ట్రిమ్ చేయడం అంటే ఏమిటి?
మీరు జుట్టును పూర్తిగా తొలగించకూడదనుకుంటే, ట్రిమ్ చేయవలసి ఉంటుంది. దీనిలో జుట్టు చిన్నదిగా మారుతుంది. గడ్డం కూడా కావలసిన ఆకృతిని పొందవచ్చు. ట్రిమ్మర్‌ను వేర్వేరు సంఖ్యలలో అమర్చడం ద్వారా కావాల్సిన ఆకృతిని పొందే ఈ పద్ధతి ప్రజలలో చాలా ప్రసిద్ధి చెందింది. గడ్డం ఉన్నవారు దీన్ని మాత్రమే ఎంచుకుంటారు. ముఖ్యంగా ఈ కాలంలోని యువకులు రకరకాల స్టైల్స్ ఫాలో అవుతున్నారు.
షేవింగ్ లేదా ట్రిమ్మింగ్?
చివరగా తలెత్తే ప్రశ్న ఏంటే.. షేవింగ్ లేదా ట్రిమ్మింగ్?.. ఏది మంచిది? అనే ప్రశ్న చాలా మందిలో తలెత్తుతుంది. మీరు గడ్డంతో అందంగా కనిపించాలనుకుంటే, మీ గడ్డం మీసాలను ఓ ఆకృతిలో కట్ చేయాలంటే ట్రిమ్మింగ్ మాత్రమే చేసుకోవాలి. అదే సమయంలో, మీరు చర్మం పరంగా మెరుగ్గా కనిపించాలనుకుంటే, షేవింగ్ ఉత్తమం ఎందుకంటే ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. చనిపోయిన చర్మాన్ని తొలగిస్తుంది. చాలా మంది మందంగా ఉన్న గడ్డాన్ని ఉంచుకుంటారు. దాని వల్ల ఆ గడ్డం కింద ఉన్న చర్మం ఎంతా పొడిగా ఉందో వారికి తెలియదు. అటువంటి పరిస్థితిలో, మీరు క్లీన్ లుక్‌ను మెయింటెయిన్ చేస్తే, అప్పుడు ముఖాన్ని బాగా శుభ్రం చేయవచ్చు. చర్మంపై ఉపయోగించే ఫేస్ వాష్ లేదా మాయిశ్చరైజర్ కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది.
ఈ విషయం గుర్తుంచుకోండి..
మీ చర్మం సున్నితంగా ఉంటే, అంటే ఏదైనా కొత్త ఉత్పత్తిని ఉపయోగించడం వల్ల చర్మంపై కొంచెం దురద లేదా ఎరుపుగా ఏర్పడినట్లయితే, మీరు ట్రిమ్మింగ్‌ను మాత్రమే ఎంచుకోవాలి, ఎందుకంటే ఇందులో ట్రిమ్మర్ మీ చర్మంతో ప్రత్యక్ష సంబంధంలోకి రాదు. ఇది జుట్టు ద్వారా జరుగుతుంది, దీని కారణంగా మీ చర్మంపై కోతలు పడకుండా ఉండటమే కాకుండా, చర్మంపై ఎరుపు కూడా ఉండదు.మీరు గడ్డం మందంగా చేయాలనుకుంటే, మీరు నెలకు ఒకసారి షేవ్ చేసి, మిగిలిన రోజుల్లో ట్రిమ్మర్‌తో సెట్ చేయవచ్చు. షేవింగ్ చేయడం వల్ల గడ్డం వేగంగా పెరుగుతుంది. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మొత్తమ్మీద, రెండింటినీ ఎన్నుకునేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 Live: కైలాసాన్ని తలపించే వేదిక.. కోటి దీపోత్సవంలో తొలిరోజు విశేషాలివే.!
-
Under -19 Asia Cup: టెయిలెండర్ల అద్భుతం.. పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఆసియా కప్ కొట్టేసిన భారత్..
-
Rahul Gandhi : ఫాసిస్టు శక్తులను తరిమికొడతాం.. హైదరాబాద్ వేదికగా రాహుల్ గాంధీ పిలుపు
-
#AA23 బిజినెస్ లెక్కలు.. వైరల్ అవుతున్న బన్నీ, లోకేష్, మైత్రీ డీల్?
-
Vigilance Raids: అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం.. రూ. 10.43 కోట్ల సరుకు స్వాధీనం..
-
SP-Congress Alliance: 200కు పైగా సీట్లు కోరుతున్న కాంగ్రెస్.. నవంబర్ 17న అఖిలేశ్‌తో కీలక భేటీ!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!