Site icon NTV Telugu

Centre All Party Delegation: అఖిలపక్ష ప్రతినిధి బృందంలో శశి థరూర్.. కాంగ్రెస్ చెప్పిన నలుగురిని కాదని..

Shashi

Shashi

ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, ఈ అంశంపై భారత్ వైఖరిని వివరించడానికి కీలకమైన విదేశీ దేశాలను సందర్శించడానికి భారత ప్రభుత్వం ఏడుగురు సభ్యుల అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ కూడా ఉన్నారు. తిరువనంతపురం నుంచి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికైన శశి థరూర్ ఈ అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇతర నామినేటెడ్ సభ్యులలో బిజెపి నాయకులు రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జనతాదళ్ (యునైటెడ్) ఎంపి సంజయ్ కుమార్ ఝా, డిఎంకెకు చెందిన కనిమొళి కరుణానిధి, ఎన్‌సిపి (శరద్ పవార్ వర్గం) నేత సుప్రియా సూలే, శివసేన (షిండే వర్గం) ఎంపి శ్రీకాంత్ షిండే ఉన్నారు.

Also Read:Ponnam Prabhakar : ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ అఖిలపక్ష ప్రతినిధి బృందంలో చేర్చమని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించిన నలుగురు ఎంపీలలో ఎవరినీ ఎంపిక చేయలేదు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ప్రకారం.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మే 16 ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో ఫోన్‌లో మాట్లాడి, పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదంపై భారతదేశ వైఖరిని వివరించడానికి విదేశాలకు పంపబడుతున్న ప్రతినిధి బృందంలో చేర్చడానికి నాలుగు పేర్లను సూచించమని వారిని అభ్యర్థించారు. నిన్న, మే 16న మధ్యాహ్నం నాటికి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి ఒక లేఖ రాసి, కాంగ్రెస్ తరపున ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్, రాజా బ్రార్ పేర్లను ఇచ్చారు. కానీ ఈ నలుగురిని కాదని శశి థరూర్ పై కేంద్రం విశ్వాసం వ్యక్తం చేసింది.

Also Read:Gold Rates: గోల్డ్ లవర్స్ కు బిగ్ రిలీఫ్.. నేటి బంగారం ధరలు ఇవే

భారత ప్రభుత్వానికి చెందిన ఈ ఏడుగురు సభ్యుల అఖిలపక్ష ప్రతినిధి బృందం మే 23 నుంచి 10 రోజుల దౌత్య కార్యకలాపాలకు బయలుదేరుతుంది. వాషింగ్టన్, లండన్, అబుదాబి, ప్రిటోరియా, టోక్యో వంటి కీలక రాజధానులను సందర్శించడం ద్వారా, ఉగ్రవాదంపై భారతదేశం అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానం, ఆపరేషన్ సింధూర్ కింద ఇటీవలి పరిణామాల గురించి విదేశీ ప్రభుత్వాలకు అఖిలపక్ష బృందం వివరిస్తుంది.

Exit mobile version