బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు షారుఖ్ ఖాన్. ప్రెజెంట్ వరసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు షారుఖ్.ఇటీవలె పఠాన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా కోట్లలో కలెక్షన్స్ రాబట్టడంతో పాటు అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ టాక్ ని అందుకుని కలెక్షన్ ల వర్షం కురిపించింది.
ఈ సినిమాతో బాలీవుడ్ కి భారీ హిట్ అందించారు షారుఖ్ ఖాన్. అంతేకాకుండా ఈ సినిమా షారుఖ్ కెరియర్ లోనే ది బెస్ట్ సినిమాలలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు వరకు కెమెరాలకు దూరంగా ఉంటూ వచ్చిన షారుఖ్ ఖాన్ సినిమా విడుదల పబ్లిక్ లోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా షారుఖ్ ఒక కార్యక్రమంలో పాల్గొన్నారని తెలుస్తుంది.ఈ నేపథ్యంలోనే షారుక్ ఖాన్ కు ఊహించని ఘటన చోటు చేసుకుంది.దుబాయ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో షారుక్ ఖాన్ లోపలికి ఎంట్రీ ఇవ్వగానే అక్కడున్న వారందరూ కూడా ఆనందంతో గట్టిగా కేకలు వేశారు. మొదట ఒక అతను వచ్చి షారుఖ్ ఖాన్ కి హాగ్ ఇవ్వగా ఇంతలో ఒక మహిళా అభిమాని కాస్త ఆయనతో ఇబ్బందికరంగా ప్రవర్తించింది. షారుఖ్ అనుమతి తీసుకోకుండానే ఆయన్ని బలవంతంగా ముద్దు పెట్టుకుంది. కాగా ఆ మహిళా షారుఖ్ వద్దకు చేరుకుని మిమ్మల్ని ముద్దుపెట్టుకోవచ్చా? అని కూడా అడిగింది. అప్పుడు షారుఖ్ సమాధానం చెప్పేలోపే ఆయన బుగ్గపై బలవంతంగా ముద్దుపెట్టింది. తన అభిమాన హీరోని ముద్దుపెట్టుకున్నానన్న ఆనందంతో వెంటనే అక్కడి నుంచి ఆమె వెళ్లిపోయింది. అయితే, అభిమాని చేసిన పనితో షారుఖ్ కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యారు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. దీనిని చూసిన పలువురు అభిమానులు ఆమె పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆమె ప్రవర్తనను తప్పుబడుతుంటే మరికొంతమంది మాత్రం.. ఆమె అదృష్టవంతురాలంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే షారుక్ ఖాన్ సినిమాల విషయానికొస్తే.. షారుఖ్ ఖాన్ ప్రస్తుతం జవాన్మరియు డుంకి సినిమాలతో బాగా బిజీగా వున్నారు.