WTC 2023 : డబ్య్లూటీసీ ఫైనల్ కు శార్దూల్ కు ఛాన్స్.. సూర్యకు నో ప్లేస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లండన్ వేదికగా ఆస్ట్రేలియతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత జట్టులో రెండు అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్ లో అదరగొడుతున్న వెటరన్ ఆటగాడు అజింక్య రహానే కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. గాయం కారణంగా దూరమైన శ్రేయస్ అయ్యర్ స్థానంలో రహానేకు అవకాశం ఇచ్చారు.
Also Read : అమెరికాలోని అత్యంత ప్రమాదకరమైన 10 అగ్నిపర్వతాలు
Also Read
- Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
- Iran: సుప్రీం లీడర్‌తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
- Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
- UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
దాదాపు 17 నెలల విరామం తర్వాత రహానేకు భారత జట్టులో చోటు దక్కడం విశేషం. అదే విధంగా ఆల్ రౌండర్ శార్థూల్ ఠాకూర్ కు కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ జట్టులో చోటు దక్కింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు శార్దూల్ ఠాకూర్ టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. ఇంగ్లండ్ పరిస్థితులు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించనున్న నేపథ్యంలో శార్దూల్ ను సెలక్టర్లు పిలుపినిచ్చారు. షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, ఉనద్కట్ తో పాటు అదనపు పేసర్ గా శార్థూల్ ఉండనున్నాడు.
Also Read : Horror: అప్పుడు ‘రాజుగారి గది’… ఇప్పుడు ‘రాణిగారి గది…’!
అదే విధంగా ప్లేయింగ్ ఎల్ వన్ లో కూడా శార్థూల్ చోటు దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే శార్థూల్ ఠాకూర్ కు ఇంగ్లండ్ గడ్డపై మంచి రికార్డు ఉంది. గతంలో ఓ ఫోర్ వికెట్ హాల్ తో పాటు ఒక హాఫ్ సెంచరీ కూడా అతని ఖాతాలో ఉంది. ఒక ఓవరాల్ గా భారత తరపున 8 టెస్టు మ్యాచ్ లు ఆడిన శార్థూల్.. 27వికెట్లతో 254 పరుగులు చేశాడు. మరోవైపు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్టు అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్ కు చోటు దక్కలేదు. తొలుత అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ ను తీసుకుంటారని వార్తలు వినిపించినప్పటికీ.. రహానే వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు.
తాజావార్తలు
-
Retirement Age: ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పదవీ విరమణ వయస్సు పెంపు..
-
Iran: సుప్రీం లీడర్‌తో మాట్లాడటం కష్టమే.. ఇరాన్ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
-
Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
-
Fact Check: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి.. అసలు నిజం ఇదే!
-
UP: అసెంబ్లీలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ కన్నుమూత
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!