Sharad Pawar: పవార్ నామినేషన్‌కు ‘మహా’ మద్దతు.. సరికొత్త ఇన్నింగ్స్‌కు రెడీ అవుతున్న మహారాష్ట్ర రాజకీయ భీష్ముడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: మహారాష్ట్ర నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎన్‌సిపి (ఎస్పీ) అధినేత శరద్ పవార్ నామినేట్ అయ్యారు. ఈ నిర్ణయానికి మహా వికాస్ అఘాడి (MVA) లోని అన్ని మిత్రపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ విషయాన్ని ఎంపీ సుప్రియా సూలే అధికారికంగా ధృవీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఉద్ధవ్ థాకరే, ఆదిత్య థాకరే, కెసి వేణుగోపాల్ వంటి అగ్రనేతలు శరద్ పవార్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారని తెలిపారు. దశాబ్దాలుగా పవార్‌తో కలిసి నడిచిన నాయకులందరూ ఇప్పుడు ఏకతాటిపైకి రావడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ క్రమంలోనే ఆమె ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు, త్వరలోనే సోనియా, రాహుల్ గాంధీలను కలిసి ధన్యవాదాలు తెలపనున్నట్లు పేర్కొన్నారు.
READ ALSO: AP Govt: ఎక్కువ మంది పిల్లలు కనే దంపతులకు రూ.25 వేలు.. సీఎం చంద్రబాబు ప్రకటన..
Also Read
- 243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
- Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
- DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
- 6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
పార్థ్ పవార్ ఎంట్రీపై క్లారిటీ..
అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ రాజ్యసభ నామినేషన్ గురించి వస్తున్న వార్తలపై సుప్రియ స్పందిస్తూ.. “కుటుంబం వేరు, పార్టీ వేరు. ఈ రెండింటినీ ఎప్పుడూ కలపకూడదు. ఎవరి స్థానం వారిదే” అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్తున్నారన్న వార్తలపై ఆమె స్పందిస్తూ.. బీహార్‌లో నితీష్ పేరుతోనే ఎన్నికలు జరిగాయని, అక్కడ జరుగుతున్న మార్పులపై పూర్తి సమాచారం వచ్చాకే మాట్లాడతానని పేర్కొన్నారు. 2006లో తాను రాజ్యసభకు వెళ్ళినప్పుడు ఎన్నిక ఏకగ్రీవమైందని సుప్రియా సూలే గుర్తు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, అన్ని పార్టీలు సమన్వయంతో వ్యవహరిస్తే శరద్ పవార్ ఎన్నిక కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. బాలాసాహెబ్ థాకరే లేకపోయినా, బీజేపీ సహా అన్ని పార్టీలు సానుకూల ధోరణితో వ్యవహరిస్తాయని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
READ ALSO: Thaman: మెగాస్టార్- బాబీ మూవీలో క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్!
తాజావార్తలు
-
BJPలో చేరిన రాఘవ్ చడ్డాకు ఓటర్ లిస్ట్ షాక్.. పంజాబ్ ఓటర్ లిస్ట్‌లో పేరు మాయం!
-
Imam ul Haq Ban: గాయం అంటూ నాటకాలు.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై రెండేళ్ల నిషేధం!
-
Irumudi Nizam : నైజాంలో ‘ఇరుముడి’ విధ్వంసం.. 13రోజుల్లో రూ. 75 కోట్ల గ్రాస్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!