Sharad Pawar: శివసేన పత్రిక సామ్నా శరద్ పవార్ రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేసింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ రాజీనామా ‘‘ప్లాన్’’ ప్రకారమే జరిగిందని సామ్నా పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది. రాజీనామాకు ముందుగానే ఆయన ప్రసంగం సిద్ధం చేసుకున్నారని వెల్లడించింది. శరద్ పవార్ రాజీనామా సీనియర్ ఎన్సీపీ నాయకులు అయిన ప్రఫుల్ పటేల్, జయంత్ పాటిల్ తో సహా చాలా మంది షాక్ ఇచ్చింది.
నిజానికి శరద్ పవార్ మహారాష్ట్ర దినోత్సవం అయిన మే 1న రాజీనామా చేయాలని అనుకున్నారని, అయితే ముంబైలో ‘వంచిత్ బహుజన్ అఘాడీ’ సమావేశం కారణంగా మే 2న రాజీనామా చేశారని తెలిపింది. శరద్ పవార్ ఆత్మకథ ‘లోక్ మంచే సంగతి’ అతని పోరాటానికి, రాజకీయ జీవిత సారానికి ప్రతిబింబం అని, అయితే అతని రాజీనామాను అర్థం చేసుకోవాలంటే, పుస్తకంలో రాయకుండా మిగిలిపోయిన పేజీలను చదవాల్సి ఉంటుందని సంపాదకీయంలో పేర్కొంది.
Read Also: Solar Maximum: “సోలార్ మాగ్జిమమ్”.. సూర్యుడిపై భారీ విస్పోటనాలు.. భూమికి ప్రమాదమా..?
శరద్ పవార్ రాజీనామా చేసిన తర్వాత ఆయన్ను ఒప్పించే ప్రయత్నాలు జరిగాయని, ఎన్సీపీలోని చాలా మంది అనుచరులు బీజేపీతో టచ్ లో ఉన్నారని, పార్టీ విచ్ఛిన్నం కాకుండా పవార్ గౌరవంగా రాజీనామా చేయాలనే ఆలోచనలోనే ఇలా చేశారని పేర్కొంది. అజిత్ పవార్ అంతిమ లక్ష్యం మహారాష్ట్రకు సీఎం కావడమే అని పేర్కొంది.
ఇదిలా ఉంటే ఆయన ఆత్మకథలో సంచలన విషయాలను ప్రస్తావించారు. ప్రధాని నరేంద్రమోడీతో తన సంబంధాలు ఎలా ఉండేవో పేర్కొన్నారు. ఉద్దవ్ ఠాక్రే సొంత పార్టీలో అసమ్మతిని అణిచివేయలేక పోరాడకుండానే సీఎం పదవికి రాజీనామా చేశారని వెల్లడించారు. మరోవైపు రేపు ఎన్సీపీ ముఖ్య సమావేశం జరగనుంది. శరద్ పవార్ వారసుడిని ఎన్నుకునే అవకాశం ఉంది. అజిత్ పవార్, సుప్రియా సూలేలు తదుపరి ఎన్సీపీ నాయకులు అవుతారనే ప్రచారం జరుగుతోంది.