NTV Telugu Site icon

Sharad Pawar: నా పార్టీని అన్యాయంగా లాగేసుకున్నారు.. ఈసీ ఆదేశాలపై సుప్రీంకోర్టుకు శరద్ పవార్..

Sharad Power

Sharad Power

మహారాష్ట్రలో రాజకీయం హీటెక్కింది. ఎన్సీపీ పార్టీలో చీలికతో శరద్ పవార్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని పార్టీని నిజమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీగా గుర్తిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం సాయంత్రం న్యాయవాది అభిషేక్ జెబరాజ్ ద్వారా వ్యక్తిగత హోదాలో పిటిషన్ దాఖలు చేశారు.

Read Also: Kota Student Death: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది నాలుగో మరణం!

ఇక, శరద్ పవార్ వర్గం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే వారికి అనుకూలంగా ఎలాంటి ఎక్స్-పార్ట్ ఆర్డర్ రాకూడదని ఆయన కంటే ముందే అజిత్ పవార్ వర్గం న్యాయవాది అభికల్ప్ ప్రతాప్ సింగ్ ద్వారా కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరి 6వ తేదీన పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్‌కు పెద్ద ఎదురు దెబ్బతో అజిత్ పవార్ వర్గమే నిజమైన ఎన్‌సీపీ అని ఎన్నికల సంఘం ప్రకటించింది.

Read Also: Minister RK Roja: నోరు ఉంది కదా అని మాట్లాడితే..! మంత్రి రోజా సీరియస్‌ వార్నింగ్‌

అయితే, అజిత్ పవార్ నేతృత్వంలోని బృందానికి ఎన్సీపీ గుర్తు ‘గడియారం’ను కూడా ఎన్నికల సంఘం కేటాయించింది. పార్టీ రాజ్యాంగం యొక్క లక్ష్యాలు, సంస్థాగత, శాసనసభ మెజారిటీ కలిగి ఉండటంతో ఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇక, ఎన్నికల కమిషన్ నిర్ణయంపై శరద్ పవార్ సుప్రీం కోర్టులో పిటిషన్ ను దాఖలు చేయడంతో త్వరలోనే దీనిపై విచారణ చేస్తామని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. దీని కోసం ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసిన తర్వాత విచారణ కొనసాగుతందని వెల్లడించింది.