Site icon NTV Telugu

Sharad Pawar: సీఎంపై సీరియస్ అయిన శరద్‌పవార్.. ‘నీకు మాట్లాడే రైట్ ఎక్కడిది?’

Sharadpawar

Sharadpawar

Sharad Pawar: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కన్నుమూయడంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్సీపీ రెండు వర్గాల విలీనంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. ఇటీవల అజిత్ పవార్ వర్గం ఎన్సీపీలో విలీనం కావడంపై సీఎం చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. “పార్టీ విలీన చర్చలు అజిత్ పవార్‌కు, మా రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్‌కు మధ్య గత రెండు నెలలుగా జరుగుతున్నాయి. ఈ అంతర్గత చర్చల్లో ముఖ్యమంత్రి ఎక్కడా పాల్గొనలేదు. అసలు సంబంధం లేని ఈ విషయంలో జోక్యం చేసుకునే హక్కు, మాట్లాడే అధికారం ఆయనకు ఎక్కడిది?” అని సీఎంను ప్రశ్నించారు.

READ ALSO: YS Jagan: పవన్ కళ్యాణ్ కూడా అసత్య ప్రచారం చేశారు.. ఫ్లెక్సీలు మాక్కూడా కట్టొచ్చు!

అజిత్ పవార్ అకాల మరణంతో తమ కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయిందని శరద్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల గురించి చర్చించడం సరైన సమయం కాదని ఆయన పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో పార్టీ కోసం శ్రమిస్తున్న కార్యకర్తలకు అండగా నిలవడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని శరద్ పవార్ తెలిపారు. అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడాన్ని ఆయన స్వాగతించారు.

READ ALSO: Chandrahass:’గుంజీ గుంజీ’ పాటపై విమర్శలకు చంద్రహాస్‌ రిప్లై.. ‘బరాబర్ సారీ చెప్పా’..

Exit mobile version