Indian 3 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2”.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ ,రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్,సుభాస్కరన్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కొన్ని కారణాల వల్ల మధ్యలోనే నిలిచిపోయింది.అయితే మళ్ళీ మొదలైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైంది.
ఇప్పటికే మేకర్స్ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ మరియు కన్నడ భాషల్లో విడుదల చేసిన ఇండియన్ 2 గ్లింప్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.ఈ మూవీలో కాజల్ ,రకుల్ ప్రీత్ సింగ్ ,సిద్దార్థ్ ,ప్రియా భవాని శంకర్, ఎస్‌జే సూర్య, బాబీ సింహా వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ క్రేజీ అప్డేట్ తెగ వైరల్ అవుతుంది.ఇండియన్ 2తోపాటు ఇండియన్ 3 కూడా ఒకేసారి షూటింగ్ జరుపుకున్నట్టు సమాచారం.ఇండియన్ 2 చిత్రాన్ని మేకర్స్ జులై లో విడుదల చేయనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.అలాగే ఇండియన్ 2 ఎండ్ క్రెడిట్స్‌లో ఇండియన్ 3 ట్రైలర్‌ను వేయనున్నట్లు సమాచారం.