బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ తన భార్య ఉమ్మీ అహ్మద్ శిశిర్‌ను మోసం చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయనిఎం విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. భర్త షకీబ్‌తో కలిసి దిగిన ఫొటోలను శిశిర్ సోషల్ మీడియాలో డిలీట్ చేయడమే ఇందుకు కారణం. ఈ వార్తలను షకీబ్ భార్య శిశిర్ తాజాగా ఖండించారు. అసత్య వార్తలను వ్యాప్తి చేయొద్దని.. ఓ భర్తగా, మంచి తండ్రిగా షకీబ్ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నాడని పేర్కొన్నారు.
భర్త షకీబ్‌తో కలిసి దిగిన ఫొటోలను డిలీట్ చేయలేదని, ప్రైవేట్‌లో పెట్టానని శిశిర్ వివరణ ఇచ్చారు. ‘క్రికెట్ పరంగా నా భర్త షకీబ్ గురించి మీకు రకరకాల అభిప్రాయాలు ఉండొచ్చు. ప్రతి ఒక్కరికీ మాట్లాడే స్వేచ్ఛ ఉంది. మీరు క్రికెట్ పరంగా ఎన్ని విమర్శలైనా చేయండి కానీ.. వాటిని మా వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టొద్దు. షకీబ్ గొప్ప భర్త, మంచి తండ్రి. నాతో ఎంతో నిజాయితీగా ఉంటాడు. నన్ను అస్సలు బాధపెట్టడు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. పెళ్లయినప్పటినుంచి ఏం మారలేదు. జీవిత భాగస్వామిగా 100/100 మార్కులు ఇవ్వొచ్చు’ అని శిశిర్ చెప్పారు.
Also Read: Nani: నా కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రం అదే: నాని
‘దయచేసి సోషల్ మీడియాలో ప్రచారంను ఆపండి. ఇలాంటి వార్తలను వ్యాప్తి చేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. నిజానికి నా వ్యక్తిగత జీవితం గురించి అందరి ముందు మాట్లాడడం ఇష్టం ఉండదు. కానీ అనవసరమైన కాల్స్, మెసేజ్‌లు వస్తుండటంతో తప్పక స్పందించాల్సి వచ్చింది. షకీబ్ ఇప్పుడు పాకిస్థాన్ సిరీస్‌పై దృష్టి పెట్టాడు. నేను మా కుటుంబంతో సరదాగా ఉన్నాను. నేను సోషల్ మీడియాలో ఎలాంటి ఫొటోలు డిలీట్ చేయలేదు. వాటిని ప్రైవేట్‌లో ఉంచాను’ అని శిశిర్ చెప్పుకొచ్చారు. షకీబ్ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నాడు. ఆగస్టు 21 నుంచి పాక్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.