Shaitaan : 50 కోట్లు మార్క్ దాటేసిన సైతాన్ మూవీ..3 డేస్ కలెక్షన్స్ ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అజయ్ దేవగన్ , జ్యోతిక మరియు ఆర్ మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సూపర్ హారర్ థ్రిల్లర్ మూవీ సైతాన్. ఈ సినిమాకు వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించారు.సైతాన్ మూవీ మార్చి 8న విడుదలైంది. విడుదల అయిన మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఈ సూపర్‌నేచురల్ హారర్-థ్రిల్లర్ మూవీ మొదటి వారాంతంలో భారతదేశంలో మొత్తంగా రూ. 53 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సైతాన్ సినిమా భారతదేశంలో శుక్రవారం రూ. 14.75 నెట్ కలెక్షన్స్‌తో ఓపెనింగ్ చేసింది. తర్వాత రెండో రోజు అయిన శనివారం రూ. 18.75 కోట్లు వసూలు చేసింది.
ఇక మూడో రోజు ఆదివారం సైతాన్ సినిమా వసూళ్లు దాదాపు రూ. 20 కోట్లుగా అంచనా వేశారు. ఇలా మూడు రోజుల్లో కలిపి మొత్తంగా సైతాన్ సినిమాకు రూ. 53 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వసూలు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.అలాగే, ఆదివారం నాడు సైతాన్ సినిమాకు హిందీలో మొత్తంగా 36.24 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయినట్లు సమాచారం. వికాస్ బహల్ దర్శకత్వం వహించిన ఈ హారర్ మూవీని జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్ మరియు పనోరమా స్టూడియోస్ నిర్మించారు. సైతాన్ సినిమాకు అజయ్ దేవగన్, జ్యోతి దేశ్‌పాండే, కుమార్ మంగత్ పాఠక్ మరియు అభిషేక్ పాఠక్ నిర్మాతలుగా వ్యవహరించారు. కృష్ణదేవ్ యాగ్నిక్ తెరకెక్కించిన గుజరాతీ మూవీ వాష్‌కు సైతాన్ మూవీ రీమేక్ గా వచ్చింది.సైతాన్ సినిమాలో జాంకీ బోడివాలకు జ్యోతిక తల్లి పాత్ర చేసింది. అలాగే అజయ్ దేవగన్‌కు భార్యగా నటించింది ఈ సినిమాలో ఆర్ మాధవన్ విలన్‌గా నటించాడు. అతీంద్రియ శక్తులు, వశీకరణం తదితర బ్లాక్ మ్యాజిక్ విషయాల్లో నిపుణుడుగా ఆర్ మాధవన్ నటన అదరగొట్టాడు.
Also Read
- 120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
- Amrapali Dubey: "పెళ్లి చేసుకోకుండానే తల్లి కావాలనుకుంటున్నాను".. అమ్రపాలి షాకింగ్ స్టేట్మెంట్
- Mumbai Indians: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా?.. రూమర్లపై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్!
- Hardik Pandya: గర్ల్‌ఫ్రెండ్‌తో తిరుమలలో హార్దిక్ పాండ్యా.. శ్రీవారికి తలనీలాలు సమర్పించి కొత్త లుక్‌తో షాక్..!
తాజావార్తలు
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Hridayam Murali OTT : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిన లేటెస్ట్ సూపర్ హిట్ ‘హృదయం మురళి’
-
Amrapali Dubey: “పెళ్లి చేసుకోకుండానే తల్లి కావాలనుకుంటున్నాను”.. అమ్రపాలి షాకింగ్ స్టేట్మెంట్
-
Mumbai Indians: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా?.. రూమర్లపై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్!
-
OBHS Team Railway: రైళ్లలో కొత్త హౌస్‌కీపింగ్ బృందం.. ఇక జనరల్ కోచ్‌లలోనూ ఫస్ట్ క్లాస్ తరహా శుభ్రత..!
ట్రెండింగ్
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!