NTV Telugu Site icon

Shah Rukh Khan: అంతర్జాతీయ అత్యుత్తమ నటుల జాబితాలో ‘కింగ్’ ఒక్కరే

Sharukh Khan

Sharukh Khan

Shah Rukh Khan: ఎంపైర్ మ్యాగజైన్ రూపొందించిన 50 మంది అంతర్జాతీయ అత్యుత్తమ నటుల జాబితాలో కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఒక్కరే చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో డెంజల్ వాషింగ్టన్, మార్లోన్ బ్రాండో, టామ్ హాంక్స్, కేట్ విన్స్‌లెట్ వంటి వారు ముందున్నారు. భారతదేశం నుండి వీరిలో చేరిన ఏకైక నటుడు షారుఖ్. నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న షారూక్ సాధించిన విజయాలను, అతడికున్న అభిమానుల గురించి ‘ఎంపైర్’ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతేకాదు, ఓ సినిమాలో అతడు చెప్పి ‘జీవితం రోజూ మన ఊపిరిని కొద్దికొద్దిగా హరిస్తుంది.. అదే బాంబు అయితే ఒకేసారి ప్రాణం తీస్తుంది’ అన్న డైలాగ్ గురించి చెబుతూ.. అతడి కెరియర్‌లోనే ఈ డైలాగ్ ఉత్తమమైనదని కొనియాడింది.

Read Also: Mother Harassing Daughter : టీనేజర్లకు గాలం వేసిన మహిళ.. ఆఖరికి కూతురిని కూడా వదల్లేదు

షారూఖ్ కెరీర్‌లో కొన్ని ముఖ్యమైన పాత్రలను ఉటంకిస్తూ అతడి పేరు ఈ జాబితాలో చేరింది. ఇందులో కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన కుచ్ కుచ్ హోతా హై నుండి రాహుల్ ఖన్నా, సంజయ్ లీలా భన్సాలీ యొక్క దేవదాస్ నుండి దేవదాస్ ముఖర్జీ, అశుతోష్ గోవారికర్ యొక్క స్వదేస్ నుండి మోహన్ భార్గవ మరియు కరణ్ జోహార్ యొక్క మై నేమ్ ఈజ్ ఖాన్ నుండి రిజ్వాన్ ఖాన్ పాత్రలున్నాయి. ‘ఎంపైర్’ మ్యాగజైన్ కథనాన్ని షారూక్ మేనేజర్ పూజా దద్లానీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Read Also:Happy Birthday Tamanna: అందంతో తమన్నా బంధం!

షారూఖ్ చివరిసారిగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన బ్రహ్మాస్త్ర సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలు పోషించారు. షారుఖ్ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్‌లో దీపికా పదుకొనే, జాన్ అబ్రహంతో కలిసి నటించనున్నారు. ఈ చిత్రంలోని మొదటి పాట, బేషరమ్ రంగ్ ఇటీవల వివాదాన్ని ఎదుర్కొంది, దీపిక ధరించిన కుంకుమపువ్వు బికినీతో సహా పాటలో ఉపయోగించిన దుస్తులపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాను నిషేధించాలంటూ నిరసన ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. ‘బాయ్‌కాట్ పఠాన్’ హ్యాష్‌టాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. పలువురు రాజకీయ నాయకులు కూడా సినిమాను తమ రాష్ట్రంలో విడుదల కానివ్వబోమని హెచ్చరించారు.