Shah Rukh Khan: అంతర్జాతీయ అత్యుత్తమ నటుల జాబితాలో ‘కింగ్’ ఒక్కరే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shah Rukh Khan: ఎంపైర్ మ్యాగజైన్ రూపొందించిన 50 మంది అంతర్జాతీయ అత్యుత్తమ నటుల జాబితాలో కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ ఒక్కరే చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలో డెంజల్ వాషింగ్టన్, మార్లోన్ బ్రాండో, టామ్ హాంక్స్, కేట్ విన్స్‌లెట్ వంటి వారు ముందున్నారు. భారతదేశం నుండి వీరిలో చేరిన ఏకైక నటుడు షారుఖ్. నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న షారూక్ సాధించిన విజయాలను, అతడికున్న అభిమానుల గురించి ‘ఎంపైర్’ ప్రత్యేకంగా ప్రస్తావించింది. అంతేకాదు, ఓ సినిమాలో అతడు చెప్పి ‘జీవితం రోజూ మన ఊపిరిని కొద్దికొద్దిగా హరిస్తుంది.. అదే బాంబు అయితే ఒకేసారి ప్రాణం తీస్తుంది’ అన్న డైలాగ్ గురించి చెబుతూ.. అతడి కెరియర్‌లోనే ఈ డైలాగ్ ఉత్తమమైనదని కొనియాడింది.
Read Also: Mother Harassing Daughter : టీనేజర్లకు గాలం వేసిన మహిళ.. ఆఖరికి కూతురిని కూడా వదల్లేదు
Also Read
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
- Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
షారూఖ్ కెరీర్‌లో కొన్ని ముఖ్యమైన పాత్రలను ఉటంకిస్తూ అతడి పేరు ఈ జాబితాలో చేరింది. ఇందులో కరణ్ జోహార్ దర్శకత్వంలో వచ్చిన కుచ్ కుచ్ హోతా హై నుండి రాహుల్ ఖన్నా, సంజయ్ లీలా భన్సాలీ యొక్క దేవదాస్ నుండి దేవదాస్ ముఖర్జీ, అశుతోష్ గోవారికర్ యొక్క స్వదేస్ నుండి మోహన్ భార్గవ మరియు కరణ్ జోహార్ యొక్క మై నేమ్ ఈజ్ ఖాన్ నుండి రిజ్వాన్ ఖాన్ పాత్రలున్నాయి. ‘ఎంపైర్’ మ్యాగజైన్ కథనాన్ని షారూక్ మేనేజర్ పూజా దద్లానీ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Read Also:Happy Birthday Tamanna: అందంతో తమన్నా బంధం!
షారూఖ్ చివరిసారిగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన బ్రహ్మాస్త్ర సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలు పోషించారు. షారుఖ్ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్‌లో దీపికా పదుకొనే, జాన్ అబ్రహంతో కలిసి నటించనున్నారు. ఈ చిత్రంలోని మొదటి పాట, బేషరమ్ రంగ్ ఇటీవల వివాదాన్ని ఎదుర్కొంది, దీపిక ధరించిన కుంకుమపువ్వు బికినీతో సహా పాటలో ఉపయోగించిన దుస్తులపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాను నిషేధించాలంటూ నిరసన ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. ‘బాయ్‌కాట్ పఠాన్’ హ్యాష్‌టాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. పలువురు రాజకీయ నాయకులు కూడా సినిమాను తమ రాష్ట్రంలో విడుదల కానివ్వబోమని హెచ్చరించారు.
Empire's list of the 50 greatest actors of all time – revealed! As celebrated in our brand new issue, and voted for by you.
READ NOW: https://t.co/zvvo1xpYhn pic.twitter.com/zE4jZmVMSj
— Empire Magazine (@empiremagazine) December 19, 2022
#ShahRukhKhan becomes the only Indian actor to be a part of @empiremagazine’s list of 50 greatest actors of all time.
In their own words, “there’s pretty much nothing he can’t do”🙌🏻😎@iamsrk, the Pride Of India! ❤️🇮🇳
Link:https://t.co/YrqNpGB1sv#SRK #Pathaan #JhoomeJoPathaan pic.twitter.com/1CqW8DVFc1— Shah Rukh Khan Universe Fan Club (@SRKUniverse) December 20, 2022
తాజావార్తలు
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!